Eye Health : డిజిటల్‌ యుగంలో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలిలో మన శరీరంలో అత్యంత సున్నితమైన కళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ తెరల ముందే ఎక్కువ సమయం గడుస్తోంది. దీనివల్ల చిన్న వయసులోనే కంటిచూపు మందగించడం, 'డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌' వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? అనేవి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి.. 

 

ఇటీవల కాలంలో చిన్నారుల్లో కూడా కంటి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కంటి చూపు సరిగా లేనికారణంగా వారికి తక్కువ  వయసులోనే కళ్లజోళ్లు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరైన పోషకాహారం లేకపోవడంతోపాటు పలురకాల అలవాట్లతో కంటి చూపు తగ్గిపోతోంది. చూపు మందగించిన తరువాత బాధపడడం కంటే ఆయా సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్త పాడడం చాలా అవసరం. 

చూపు తగ్గిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆ సమస్యలు రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి ఏమేం చేయాలి..? అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 పోషకాహారం తప్పనిసరి..  

మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కళ్ల పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.

"సి" విటమిన్‌ ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష,  బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

పోషకాలు..  

కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగి స్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. అంతేకాకుండా గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు,చేపలు,  చిలకడదుంపలు,క్యారట్ వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. 
 
కంప్యూటర్‌ లేదా మొబైల్‌ స్క్రీన్‌లను చూసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును, కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. దీనివల్ల కంటి కండరాలపై ఒత్తిడి తగ్గి, చూపు మెరుగుపడుతుంది.

చత్వారం వంటివి ఉన్నపెద్దవాళ్లకే కాదు.. పిల్లలకు కూడా ఐ చెకప్ లు చేయించాలి. చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడతారు. అంతేకాదు శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 


గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.