physical-health
Gas Trouble : గ్యాస్ సమస్య అనుకుని నిర్లక్ష్యంచేస్తున్నారా..? ప్రాణాంతక క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఇది జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : అజీర్ణం, కడుపు ఉబ్బరం, గుండెమంట, కడుపు నొప్పి.. నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సాధారణ సమస్యలివి. అయితే, తరచూ వచ్చే ఇలాంటి జీర్ణకోశ ఇబ్బందులను కేవలం ‘గ్యాస్’ లేదా ‘ఎసిడిటీ’ అని సరిపెట్టుకుని సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన లూసీ డ్రైవర్ అనే మహిళ కథ ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (pancreatic cancer) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేస్తోంది.
