శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

షేర్ చేయండి:
శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

సాక్షి లైఫ్ : ప్లేట్‌లెట్స్ రక్తంలో కనిపించే చిన్న రక్త కణాలు రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే, అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌ను థ్రోంబోసైటోపెనియా అని కూడా అంటారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది, అయితే అలాంటి సందర్భాలు చాలా అరుదు. కానీ డెంగ్యూ, లుకేమియా, క్యాన్సర్ తదితర వ్యాధుల వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది.

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి..?

పురుషులలో సాధారణ ప్లేట్‌లెట్ కౌంట్ పరిధి మైక్రోలీటర్‌కు లక్షా యాభై వేల నుంచి నాలుగులక్షల యాభై వేల వరకు ఉండాలి. మహిళల్లో మైక్రోలీటర్‌కు లక్షా యాభై వేల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు ఉండాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్(సిబిసి) పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చు.

ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ముక్కు లేదా చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం

 శరీరానికి తగిలిన గాయాలు నీలం రంగులోకి మారడం

ఋతుస్రావం సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవ్వడం

మలం నలుపు లేదా ఎరుపు రంగులో రావడం..  

చర్మంపై చిన్న ఎర్రటి మచ్చలు

ప్లేట్‌లెట్స్ తగ్గడానికి గల కారణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే యాంటీ బయోటిక్స్ లేదా ఇతర మందులు ఇస్తారు. శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉంటే కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. ఆల్కహాల్, వేయించిన ఆహారాలు, రెడ్ మీట్, అధిక సోడియం ఆహారాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటో, పసుపు, అల్లం, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలకు దూరంగా ఉండాలి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.