Ghee Pure or Adulterated : నెయ్యి స్వచ్ఛమైనదేనా..? కాదా అని.. ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : భారతీయ వంటకాల్లో నెయ్యికి ఉండే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వంటకాలకు అద్భుతమైన రుచిని అందించడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లో నకిలీ, కల్తీ నెయ్యి దందా కూడా జోరుగా సాగుతోంది. సాధారణంగా నెయ్యి పూసపూసగా ఉంటే అది స్వచ్ఛమైనదని చాలామంది నమ్ముతుంటారు. కానీ, వనస్పతి, చౌకైన నూనెలు కలిపిన కల్తీ నెయ్యి కూడా అచ్చం అలాగే కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మనం వాడుతున్న నెయ్యి అసలైనదో, నకిలీదో తెలుసుకోవడం ఎలా..? ఇంట్లోనే సులభంగా పరీక్షించి తెలుసుకునే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
నెయ్యి స్వచ్ఛతను గుర్తించే మార్గాలు..
అరచేతిలో వేసి చూడండి..
కొద్దిగా నెయ్యిని అరచేతిలో వేసుకుని సున్నితంగా రుద్దండి. అది అసలైనదైతే మన శరీర ఉష్ణోగ్రతకు వెంటనే కరిగిపోయి, సహజమైన వాసన వస్తుంది. కరగడానికి సమయం పట్టినా, వింతైన వాసన వచ్చినా అందులో కల్తీ జరిగినట్లే.
రుచి, వాసన పసిగట్టండి..
స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యికి కమ్మని సువాసన ఉంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది, రుచి కూడా కాసేపు నిలిచి ఉంటుంది. ఒకవేళ కృత్రిమ వాసనలు వస్తున్నా, విపరీతమైన జిగురుగా అనిపించినా, రుచి తేడాగా ఉన్నా అది నకిలీదని అనుమానించాల్సిందే.
వేడి చేసి చూడండి..
ఒక చెంచా నెయ్యిని పెనంలో వేసి సన్నని మంటపై వేడి చేయండి. స్వచ్ఛమైన నెయ్యి వెంటనే కరిగిపోయి బంగారు వర్ణంలోకి మారుతుంది, కమ్మటి వాసన వస్తుంది. అలా కాకుండా వేడి చేసినప్పుడు నురగ ఎక్కువగా వచ్చినా, రంగు అసాధారణంగా మారినా, ఘాటైన వాసన వచ్చినా అందులో రసాయనాలు లేదా ఇతర నూనెలు కలిపారని అర్థం.
ఫ్రిజ్‌లో పెట్టి చూడండి..
కొద్దిగా నెయ్యిని ఒక గిన్నెలో తీసుకుని కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. అది స్వచ్ఛమైనదైతే గిన్నెలో అంతటా ఒకేలా గడ్డకడుతుంది. అలా కాకుండా పొరలు పొరలుగా పేరుకుపోయినా, సగం గట్టిగా సగం మెత్తగా ఉన్నా.. వేరే రకమైన కొవ్వులు కలిపారని స్పష్టంగా తెలుసుకోవచ్చు.
కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఎల్లప్పుడూ నమ్మకమైన దుకాణాలు లేదా పేరున్న బ్రాండ్ల (Brands) నెయ్యినే ఎంచుకోవాలి.
ప్యాకింగ్ పై ఉన్న FSSAI లైసెన్స్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీలను తప్పకుండా గమనించాలి.
తక్కువ ధరకు వస్తుందని ఆశపడితే నాణ్యత లేని నెయ్యి కొని అనారోగ్యం పాలుకావాల్సి వస్తుంది. కాబట్టి ధర విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.
వాసన, రుచి పోకుండా ఉండాలంటే నెయ్యిని ఎల్లప్పుడూ చల్లని, పొడి ప్రదేశంలో (Dry place) నిల్వ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
