Amazing Health Benefits of Mint : పుదీనా నీటితో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఆరోగ్యకరమైన, సహజసిద్ధమైన పానీయం కోసం చూస్తున్నట్లయితే.. 'పుదీనా నీరు' (Mint Water) బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పుదీనా కేవలం వంటకాల్లో రుచిని పెంచే ఆకు మాత్రమే కాదు, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే అద్భుతమైన అలవాట్లు.. మందులతో పనే లేదు..!

ఇది కూడా చదవండి..Pimples : ముఖంపై పదే పదే మొటిమలు వేధిస్తున్నాయా..? ఐతే లోపం చర్మంలో కాదు, శరీరంలోనే..!

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

పుదీనా నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..  

శరీరానికి చలువ..

పుదీనాకు సహజంగానే చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, వడదెబ్బ (Heatstroke) ముప్పు తప్పుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

 ఎండాకాలంలో గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటాయి. పుదీనా నీటిలోని ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్టను తేలికగా ఉంచుతాయి.

హైడ్రేషన్‌కు అద్భుతం..

ఎండల వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది. పుదీనా వాటర్ తాగడం వల్ల శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వేసవిలో తరచుగా వేధించే నీరసం, తలతిరగడం వంటి సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

నోటి దుర్వాసనకు చెక్..

పుదీనా ఒక సహజసిద్ధమైన 'మౌత్ ఫ్రెషనర్‌'లా పనిచేస్తుంది. పుదీనా ఆకులు వేసిన నీటిని తాగడం వల్ల నోరు తాజాగా ఉండటమే కాకుండా, శ్వాసలో దుర్వాసన తగ్గుముఖం పడుతుంది.

ఒత్తిడి, అలసట మాయం..

 వేసవిలో నిరంతరం అలసట, నీరసంగా అనిపించడం సహజం. పుదీనా సువాసన, అందులోని సుగుణాలు శరీరాన్ని, మనస్సును రిఫ్రెష్ చేస్తాయి. ఇది మూడ్‌ను వెంటనే ఉత్సాహపరుస్తుంది.

చర్మ సౌందర్యానికి మేలు..

పుదీనా నీరు శరీరంలోని వ్యర్థాలను (toxins) బయటకు పంపి శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. దీని ప్రభావం వల్ల చర్మం ముడతలు పడకుండా, మొటిమలు తగ్గి ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

పుదీనా నీటిని ఎలా తయారు చేసుకోవాలి..?

దీని తయారీ చాలా సులువు. ఒక బాటిల్ లేదా జగ్గులో శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో కొన్ని తాజా పుదీనా ఆకులు వేయాలి. దానికి కొద్దిగా నిమ్మరసం, రుచి కోసం చిటికెడు నల్ల ఉప్పు (Black Salt) కలపాలి. ఈ మిశ్రమాన్ని కొన్ని గంటల పాటు అలాగే పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఈ నీటిని రోజంతా కొద్దికొద్దిగా తాగవచ్చు.వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇంట్లోనే సులువుగా చేసుకోగలిగే ఈ సహజసిద్ధమైన పుదీనా నీరు ఎంతో మేలు చేస్తుంది.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.