Dental problems : క్లీనింగ్ చేయిస్తే పళ్లు బలహీనపడతాయా..? ఇందులో నిజమెంత..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దంతాల పరిశుభ్రత, డెంటల్ క్లీనింగ్ (scaling) విషయంలో చాలామందిలో అనేక అపోహలు ఉంటాయి. పళ్లను మెషిన్‌తో శుభ్రం చేయిస్తే దంతాలు బలహీనపడతాయని, వాటి మధ్య సందులు వస్తాయని భయపడుతుంటారు. ఈ అపోహల వల్లే అవసరమైనప్పటికీ దంత వైద్యులను (dentist) సంప్రదించడానికి చాలామంది వెనుకాడుతుంటారు. అయితే దంత వైద్యుల ప్రకారం.. దంతాల క్లీనింగ్ అనేది ఎంతో సురక్షితమైన, సాధారణ ప్రక్రియ. పళ్లపై పేరుకుపోయిన గారను తొలగించి నోటిని ఆరోగ్యంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం. అసలు స్కేలింగ్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాటి వెనుకున్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?

ఇది కూడా చదవండి.. World hepatitis day 2026 : హెపటైటిస్.. నిజంగా ప్రాణాలు తీస్తోందా..? ఇది ఎన్ని రకాలు..?

ఇది కూడా చదవండి.. Amazing Healthy Food : పిల్లలు, పెద్దల కోసం అమేజింగ్ హెల్తీ ఫుడ్స్..

 

డెంటల్ స్కేలింగ్ అంటే ఏమిటి..?

దంతాలు, చిగుళ్ల చుట్టూ దీర్ఘకాలంగా పేరుకుపోయిన ప్లాక్, టార్టార్ అంటే గార, బ్యాక్టీరియాను ప్రత్యేకమైన పరికరాలతో శుభ్రం చేసే ప్రక్రియనే 'స్కేలింగ్' అంటారు. మనం రోజూ చేసే సాధారణ బ్రషింగ్ ద్వారా ఈ కఠినమైన గార తొలగిపోదు. కాబట్టి దంతాల ఆరోగ్యం కోసం అవసరాన్ని బట్టి స్కేలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

స్కేలింగ్ చేస్తే దంతాలు బలహీనపడతాయా..?

ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దంతాలపై పేరుకుపోయిన గార కాలక్రమేణా ఒక కఠినమైన పొరలా మారుతుంది. స్కేలింగ్ ద్వారా ఆ గారను తొలగించినప్పుడు దంతాలు పలుచబడినట్లు లేదా బలహీనపడినట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి, ఇది కేవలం మురికిని తొలగించడం వల్ల కలిగే భావన మాత్రమే. స్కేలింగ్ వల్ల పళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బలహీనపడవు.

శుభ్రం చేసిన తర్వాత పళ్లు ఎందుకు జివ్వుమంటాయి..?

స్కేలింగ్ చేయించుకున్న తర్వాత కొందరికి చల్లని లేదా వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్లు జివ్వుమంటుంటాయి (sensitivity). దీర్ఘకాలంగా పేరుకుపోయిన గార తొలగించినప్పుడు దంతాల అసలు ఉపరితలం బయటపడుతుంది. దీనివల్లే ఈ సెన్సిటివిటీ వస్తుంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదు, ఇది కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోయి పళ్లు సాధారణ స్థితికి వస్తాయి.

దంతాల మధ్య సందులు పెరుగుతాయా..?

క్లీనింగ్ చేస్తే పళ్ల మధ్య సందులు వస్తాయన్నది కూడా ఒక అపోహే. దంతాల మధ్య ఉండే సహజమైన సందులను టార్టార్ అంటే గార కప్పేస్తుంది. స్కేలింగ్ చేసినప్పుడు ఆ గార తొలగిపోయి, దంతాల మధ్య ఉన్న సహజమైన గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగానీ స్కేలింగ్ వల్ల కొత్తగా సందులు ఏర్పడవు.

దంతాల క్లీనింగ్ ఎందుకు అవసరం..?

చిగుళ్ల వ్యాధుల నివారణ..

 గారను తొలగించడం వల్ల చిగుళ్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. గారలో ఉండే బ్యాక్టీరియా వల్లే నోటి దుర్వాసన వస్తుంది. స్కేలింగ్ ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. దంతాలపై ఉన్న పసుపుదనం, మురికి తొలగిపోయి పళ్లు శుభ్రంగా, తెల్లగా మారతాయి. దంతాలు, చిగుళ్లు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి, మొత్తం నోటి ఆరోగ్యం (oral health) మెరుగుపడుతుంది. మీ పళ్లపై గార ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే, అపోహలను పక్కనపెట్టి వెంటనే దంత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్యకరమైన చిరునవ్వుకు సరైన దంత సంరక్షణే ప్రధానం.

 

ఇది కూడా చదవండి.. Omega-3 Supplements : జ్ఞాపకశక్తి కోసం ఒమేగా-3 సప్లిమెంట్లు వాడుతున్నారా..? తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఇది కూడా చదవండి.. Cholesterol : కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే అద్భుతమైన అలవాట్లు.. మందులతో పనే లేదు..!

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. Acidity : ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా..? ఉపశమనం కోసం అద్భుతమైన ఇంటి చిట్కాలు..!

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.