ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. జంక్ ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ లేమి వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతు న్నాయి. ఈ నేపథ్యంలో 5 నుంచి 18 ఏళ్ల పిల్లలు, యువకుల ఆహారంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా కొత్త పాలసీని రూపొందించాయి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

 

సమతుల్య ఆహారమే ముఖ్యం..

పిల్లలకు రంగురంగుల కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం అందించాలని ఈ పాలసీ సూచిస్తోంది.

జంక్ ఫుడ్‌కు దూరంగా..

పిజ్జా, బర్గర్లు, ప్యాకెట్ స్నాక్స్, చక్కెర శీతల పానీయాలు, మిఠాయిలు, కేకులు, ఎక్కువగా వేయించిన ఆహారాలు, రెడీమేడ్ ఫుడ్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను నివారించడం లేదా వీలైనంత తగ్గించడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వ్యాయామం, క్రమశిక్షణ..

రోజుకు కనీసం 60 నిమిషాలు వ్యాయామం చేయించాలని, భోజన సమయంలో మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలని పాలసీలో సూచించారు. దీంతోపాటు పిల్లలకు పోషకాహారంపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యమని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సరైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమతోనే పిల్లల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.