Kidney Health : కిడ్నీల ఆరోగ్యం..ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తున్నాయా..? నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు (kidneys) ఒకటి. రక్తంలోని వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడంతో పాటు శరీరంలో మినరల్స్ సమతుల్యతను కాపాడటం, రక్తపోటును (bp) నియంత్రించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను బయటపెట్టవు. వ్యాధి ముదిరే కొద్దీ మాత్రమే కొన్ని సంకేతాలు ఇస్తాయి. ఈ కింది సమస్యలు మిమ్మల్ని పదే పదే వేధిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..Mobile Phone : మొబైల్ ఫోన్ను దిండు కింద పెట్టుకుని నిద్రించడం ప్రమాదకరమా..? ఎందుకు..?
ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకండి..
మూత్రవిసర్జనలో మార్పులు..
సాధారణం కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్రం రావడం, ముఖ్యంగా రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం కిడ్నీ సమస్యలకు ప్రాథమిక సంకేతం కావచ్చు.
మూత్రంలో నురగ..
మూత్రం నురగగా వస్తుంటే మీ శరీరం నుంచి ప్రొటీన్ బయటకు పోతోందని అర్థం. దీన్ని తరచుగా గమనిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
శరీరంపై వాపులు..
కిడ్నీలు శరీరంలోని అదనపు నీటిని, ఉప్పును సరిగ్గా వడపోయలేనప్పుడు ఆ నీరు శరీరంలోనే నిలిచిపోయి ముఖం, పాదాలు, చీలమండల వద్ద వాపులు వస్తాయి.
తీవ్రమైన అలసట, నీరసం..
కిడ్నీల పనితీరు మందగించినప్పుడు రక్తంలో వ్యర్థాలు పెరిగిపోయి విపరీతమైన అలసట, నీరసం ఆవహిస్తాయి. ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేరు.
ఆకలి లేకపోవడం, వికారం..
కిడ్నీ సమస్య తీవ్రమవుతున్న కొద్దీ ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, తరచుగా వాంతులు రావడం వంటివి జరుగుతాయి.
చర్మం పొడిబారడం, దురద..
రక్తంలో వ్యర్థాలు, టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల చర్మం పొడిబారిపోయి, తీవ్రమైన దురదలు వస్తుంటాయి.
ఎవరికి ముప్పు ఎక్కువ..? ఎలాంటి పరీక్షలు చేయాలి..?
మధుమేహం (diabetes), అధిక రక్తపోటు (hypertension), గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారితో పాటు వంశపారంపర్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధుల ముప్పు ఎక్కువ. వయసు పైబడిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సాధారణంగా రెండు రకాల పరీక్షలు సూచిస్తారు. కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి 'eGFR' అనే రక్త పరీక్ష, అలాగే మూత్రంలో ఆల్బుమిన్,ప్రొటీన్ లీకేజీని పసిగట్టడానికి 'uACR' అనే మూత్ర పరీక్ష చేస్తారు.
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
