Pomegranate : దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా..? ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దానిమ్మ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తహీనతను తగ్గించడానికి చాలామంది దీనిని తమ రోజువారీ డైట్‌లో చేర్చుకుంటారు. అయితే, ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం దానిమ్మ హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

 

కిడ్నీ సమస్యలు ఉంటే..

మూత్రపిండాల వ్యాధులతో (kidney diseases) బాధపడేవారు దానిమ్మను తినేముందు కాస్త ఆలోచించాలి. ఇందులో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. కిడ్నీల పనితీరు మందగించిన ప్పుడు శరీరంలోని పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను అదుపు చేయడం కష్టమవుతుంది. కాబట్టి కిడ్నీ పేషెంట్లు దీన్ని తినే ముందు లేదా జ్యూస్ తాగే ముందు కచ్చితంగా తమ వైద్యుడి సలహా తీసుకోవాలి.

మధుమేహ రోగులు జ్యూస్ తాగొద్దు..

దానిమ్మలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ, సహజ సిద్ధమైన చక్కెరలు కూడా ఎక్కువే ఉంటాయి. మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ పండును మితంగా తినవచ్చు కానీ, జ్యూస్ రూపంలో తీసుకోకపోవ డమే మంచిది. జ్యూస్ చేయడం వల్ల పండులోని ఫైబర్ (fiber) నశించిపోయి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.

లో-బీపీ (Low BP) ఉన్నవారు..

రక్తపోటును (bp) తగ్గించే గుణం దానిమ్మకు ఉంది. కాబట్టి, సహజంగానే 'లో బీపీ'తో బాధపడేవారు లేదా బీపీ తగ్గడానికి క్రమం తప్పకుండా మందులు వాడేవారు దానిమ్మకు దూరంగా ఉండటమే మేలు. దీన్ని అతిగా తీసుకుంటే బీపీ మరింత పడిపోయి కళ్లు తిరగడం, తీవ్రమైన నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలర్జీలు ఉంటే..

చాలా అరుదుగా కొంతమందికి దానిమ్మ పడకపోవచ్చు. దీన్ని తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడటం, దురద, పెదాలు లేదా గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే తినడం మానేసి డాక్టర్‌ను సంప్రదించాలి.

క్రమం తప్పకుండా మందులు వాడేవారు..

ఏదైనా దీర్ఘకాలిక సమస్యల కోసం రెగ్యులర్‌గా మందులు, ముఖ్యంగా బీపీ, షుగర్ లేదా రక్తం పల్చబడే మందులు వాడేవారు.. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో దానిమ్మను లేదా దానిమ్మ రసాన్ని తమ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుల సూచనలు పాటించడం సురక్షితం.

 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.