The ‘24-Hour’ Formula : సంపూర్ణ ఆరోగ్యానికి '24 గంటల' ఫార్ములా.. ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా ప్లాన్ చేసుకోండి..!
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి ఏవైనా షార్ట్‌కట్స్ ఉన్నాయా? ఏదైనా ఒక 'సూపర్ ఫుడ్' తింటే సర్వ రోగాలు మాయమైపోతాయా? అంటే వైద్య నిపుణులు కచ్చితంగా 'లేవు' అనే సమాధానమే చెబుతారు. అసలైన ఆరోగ్యం అనేది మనం రోజువారీగా పాటించే చిన్నచిన్న అలవాట్లలోనే దాగి ఉంటుంది. చాలామంది కేవలం బరువు తగ్గడాన్నే ఆరోగ్యంగా భావిస్తుంటారు. కానీ, ఫిట్‌నెస్ అనేది అంతకంటే చాలా పెద్దది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన దినచర్య ఎలా ఉందన్నదే మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వైద్య నిపుణులు సూచిస్తున్న '24 గంటల ఫార్ములా ' ఏంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఉదయం లేత ఎండ పడాల్సిందే..
ఉదయాన్నే కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. బాల్కనీలోనో, డాబా పైనో కాసేపు నడవడం మంచిది. సూర్యరశ్మి మన శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' (body's 'circadian rhythm)ను క్రమబద్ధీకరించి, రాత్రివేళ సుఖంగా నిద్రపట్టేలా చేస్తుంది. అలాగే ఎముకల పటుత్వానికి అవసరమైన 'విటమిన్-డి' కూడా ఉచితంగా పుష్కలంగా లభిస్తుంది.
డైట్ అనగానే 'సలాడ్లు' కాదు..
చాలామంది హెల్తీ డైట్ అనగానే అన్నం మానేసి కేవలం సలాడ్లు మాత్రమే తింటుంటారు. కానీ, సమతుల్య ఆహారం అంటే మన పళ్లెంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్, గుడ్లు వంటివి సరైన మోతాదులో ఉండటం. మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అన్నీ అందాలంటే భోజనంలో వైవిధ్యం ఉండాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు, చెడు కొవ్వులకు వీలైనంత దూరంగా ఉండాలి.
గంటల తరబడి కూర్చోవడం వల్ల..
గంటల తరబడి కంప్యూటర్లు, ఫోన్ల ముందు కూర్చోవడం వల్ల శరీరానికి శ్రమ కరవవుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీసులో పనిచేసేవారు మధ్యమధ్యలో విరామం (స్క్రీన్ బ్రేక్) తీసుకోవడం తప్పనిసరి. గంటకోసారి కుర్చీలోంచి లేచి అటూఇటూ నడవడం, కళ్లకు కాస్త విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.
నీరు.. ప్రాణాధారం..
మన శరీరంలోని అవయవాలు చురుగ్గా, సక్రమంగా పనిచేయాలంటే హైడ్రేషన్ ఎంతో ముఖ్యం. వాతావరణం, మీరు చేసే శారీరక శ్రమను బట్టి రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి.
మానసిక ప్రశాంతతకు పెద్దపీట..
శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంది. ఒత్తిడిని జయించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
కంటినిండా నిద్ర..
ప్రతి వయోజనులు రోజుకు కనీసం 7 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. పగటిపూట అలసిపోయిన శరీరానికి, మెదడుకు తిరిగి శక్తినిచ్చేది నిద్రే. నిద్రలేమి వల్ల ఏకాగ్రత లోపించడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
