Stored Chapati : నిల్వ ఉంచిన చపాతీ పిండితో రొట్టెలు చేస్తున్నారా..? ఆరోగ్యానికి ఇది సురక్షితమేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రాత్రిపూట చపాతీలు చేసిన తర్వాత మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజు ఉదయం వాడుకోవడం చాలా ఇళ్లలో సాధారణంగా జరిగే పనే. ఆహారం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ శాతం మంది ఇలా చేస్తుంటారు. అయితే, ఇలా మిగిలిపోయిన లేదా నిల్వ ఉంచిన పిండిని వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..? దీని వల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా..? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

 

తడిపిన పిండిలో ఏం జరుగుతుంది..?

 

పొడి పిండితో పోలిస్తే నీళ్లు పోసి తడిపిన పిండిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అందులో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు సులభంగా వృద్ధి చెందుతాయి. తడిపిన పిండిని సాధారణ గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్ద ఎక్కువసేపు ఉంచితే అది త్వరగా పాడవుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

ఫ్రిజ్‌లో పెడితే సురక్షితమేనా..?

మిగిలిపోయిన పిండిని బయట ఉంచే బదులు వీలైనంత త్వరగా ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అయితే, దాన్ని గాలి చొరబడని (Air-tight) డబ్బాలో ఉంచి మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి నెమ్మదిస్తుంది కానీ, పూర్తిగా ఆగిపోదు. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టిన పిండి ఎప్పటికీ పాడవదని అనుకోవడం పొరపాటే. వాడుకునే ముందు ఆ పిండి పరిస్థితిని ఒకసారి గమనించడం ముఖ్యం.

కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ ముప్పు..సరైన పద్ధతిలో నిల్వ చేయని పిండిలో హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. అలాంటి పిండితో చేసిన చపాతీలు తింటే 'ఫుడ్ పాయిజనింగ్' అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.

 

పిండిలో ఈ మార్పులు కనిపిస్తే వాడొద్దు..! మిగిలిపోయిన పిండిని మరుసటి రోజు తీసినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే, దానిని వాడకపోవడమే మంచిది. పుల్లటి వాసన..పిండి నుంచి అసాధారణమైన లేదా పుల్లటి వాసన వస్తుంటే పాడైపోయి నట్లే. బూజు పట్టడం..పిండిపై తెల్లగా లేదా నల్లగా బూజు (Fungus) లాంటిది కనిపిస్తే వెంటనే పారేయాలి. రంగు మారడం.. పిండి సహజమైన రంగును కోల్పోయి, నలుపు లేదా వేరే రంగులోకి మారితే వాడకూడదు. జిగురుగా మారడం.. పిండి మరీ జిగురుగా, తీగల్లా సాగుతున్నట్లు అనిపిస్తే అందులో బ్యాక్టీరియా పెరిగిందని అర్థం.

ఎలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి..?

చిన్న పిల్లలు, వృద్ధులు, అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిల్వ ఉంచిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. పాడైపోయినట్లు అనిపించిన పిండిని వేడి చేసి కాల్చినా అందులోని హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశించకపోవచ్చు. కాబట్టి, ఎప్పటికప్పుడు తాజా పిండిని తడుపుకుని చపాతీలు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.