Moringa Drumsticks for Weight Loss : మునగకాడలతో అధిక బరువుకు చెక్.. ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మునగకాడలు (Drumsticks).. మన వంటగదిలో తరచుగా కనిపించే కూరగాయ. సాంబారులో మునగకాడ లేకపోతే ఆ రుచే రాదు అంటుంటారు. అయితే ఇవి రుచికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు (fiber) పుష్కలంగా ఉండే మునగకాడలతో బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. తక్కువ క్యాలరీలు ఉండే ఈ కూరగాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలేంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

మునగకాడలతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

1. జీర్ణవ్యవస్థకు మేలు..

మునగకాడల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును సాఫీగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాకుండా, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఫైబర్ ఎక్కువగా తీసుకునేటప్పుడు శరీరానికి తగినంత నీరు కూడా అందించాలి.

2. ఎముకల దృఢత్వం..

మునగలో క్యాల్షియం, ఫాస్ఫరస్ (phosphorus) తగిన మోతాదులో లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు ఎంతో అవసరం. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా ఇవి సహాయపడతాయి.

3. యాంటీ ఆక్సిడెంట్ల రక్షణ..

శరీరంలో కణాల క్షీణతకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడి (oxidative stress) నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు మునగలో మెండుగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

4. రోగనిరోధక శక్తికి అండ..

మునగకాడల్లో విటమిన్-సి తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, సాధారణ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.

5. బరువు నియంత్రణలో..

బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్. మునగలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. తక్కువ నూనెతో మునగను వండుకుని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది.. పదే పదే ఆకలి వేయదు. దీంతో బరువు అదుపులో ఉంటుంది.

6. పోషకాల గని..

విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కొంతమేర ప్రొటీన్లు.. ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలకు మునగకాడలు కేరాఫ్ అడ్రస్. అందుకే నిపుణులు దీన్ని పోషకాహారంగా పరిగణిస్తారు.

ఆహారంలో ఎలా చేర్చుకోవాలి..?

కూరగా..: తక్కువ నూనె, మితంగా జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి వంటివి వాడి మునగకాడ ఇగురు లేదా కూర చేసుకోవచ్చు.

పప్పులో..: కందిపప్పు లేదా పెసరపప్పుతో కలిపి వండుకోవడం ద్వారా పోషకాలను మరింత పెంచుకోవచ్చు.

సాంబారులో..: మునగకాడల టేస్ట్ అద్భుతంగా తెలిసేది సాంబారులోనే. ఇలా మీ రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మునగకాడలను ఎప్పుడూ తాజాగా ఉన్నవే ఎంచుకోవాలి. వండే ముందు శుభ్రంగా కడగాలి.

ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు. ఒకే ఆహారాన్ని అతిగా తినడం మంచిది కాదు.

ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడుతున్నవారు వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు వీటిని డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.