Electrolyte Imbalance : వడదెబ్బే కాదు.. ఎలక్ట్రోలైట్ల లోపమూ ప్రాణాలకే ముప్పు.. 

షేర్ చేయండి:
Electrolyte Imbalance : వడదెబ్బే కాదు.. ఎలక్ట్రోలైట్ల లోపమూ ప్రాణాలకే ముప్పు.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో కేవలం నీరు తాగితే సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అసలేమిటీ ఎలక్ట్రోలైట్లు..? వీటి లోపాన్ని ఎలా గుర్తించాలి..?

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న తరుణంలో బాడీ డీహైడ్రేషన్‌కు గురవ్వడం సర్వసాధారణం. అయితే, డీహైడ్రేషన్ అంటే కేవలం నీరు తగ్గడమే కాదు.. నీటితో పాటు శరీరానికి అత్యంత అవసరమైన లవణాలు (electrolytes) కూడా తగ్గడం. ఇవి తగ్గితే నీరసం, తలతిరగడమే కాకుండా మూత్రపిండాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఎలక్ట్రోలైట్లు అంటే ఏమిటి..?

ఎలక్ట్రోలైట్లు అనేవి మన రక్తం, చెమట, ఇతర శరీర ద్రవాలలో ఉండే ఖనిజాలు. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇవి శరీరంలో విద్యుత్ తరంగాలను ప్రసరింప జేస్తూ.. కండరాలు, నాడులు, మెదడు సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.

ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడితే వచ్చే సమస్యలు..

శరీరానికి అవసరమైన ఈ ఖనిజాలు తగ్గితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొటాషియం లోపం వల్ల గుండె స్పందనలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కండరాల నొప్పులు, మలబద్ధకం, తీవ్రమైన కేసుల్లో పక్షవాతం వచ్చే ముప్పు ఉంది. సోడియం లోపం..రక్తపోటు తగ్గిపోవడం, వికారం, వాంతులు, గందరగోళంగా ఉండటం, మూర్ఛలు రావచ్చు. ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మెగ్నీషియం లోపం..మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, కండరాల పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎందుకు ముఖ్యం..?

నీటి సమతుల్యత: కణాల లోపల, బయట నీటి శాతాన్ని క్రమబద్ధీకరి స్తాయి. పొటాషియం, కాల్షియం కలిసి గుండె లయ తప్పకుండా కొట్టుకునేలా చేస్తాయి. కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందడానికి ఈ ఖనిజాలే ఆధారం.

సమతుల్యతను కాపాడుకోండిలా..

వేసవిలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడానికి కేవలం మంచి నీరు మాత్రమే సరిపోదు. ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అరటిపండు, నారింజ, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి.

ఎండలో ఎక్కువగా తిరిగే వారు లేదా నీరసంగా ఉన్నవారు ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం ఉత్తమం. దీనిని ఇంట్లోనే పంచదార, ఉప్పు కలిపి తయారు చేసుకోవచ్చు. పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేయడంతో పాటు అవసరమైన ప్రోబయోటిక్స్, ఖనిజాలు అందుతాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. నీరసం లేదా తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.