న్యూ స్టడీ : పారాసెటమాల్ తో కాలేయానికి తీవ్ర హాని.. 

సాక్షి లైఫ్ : ఫీవర్ వచ్చినా.. ఒళ్లు నొప్పులుగా అనిపించినా కనీసం డాక్టర్ ను కూడా సంప్రదించకుండా చాలామంది పారాసెటమాల్ టాబ్లెట్ వాడుతుంటారు. ఒక్కసారి జ్వరం, తలనొప్పి వస్తే పారాసిటమాల్‌ మాత్ర వేసుకుంటే తగ్గుతుందనే నమ్మకం జనాల్లో ఉంది. అయితే అతిగా పారాసెటమాల్ వేసుకుంటే తీవ్రమైన వ్యాధుల బారీన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

పెయిన్ కిల్లర్.. 

పారాసెటమాల్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే పెయిన్ కిల్లర్. కోవిడ్ తర్వాత, పారాసెటమాల్ ఎక్కువగా కోరుకునే నొప్పి నివారణ మందులలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. అయితే మోతాదుకు మించి తీసుకుంటే దీని కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా నిరూపించారు. 

పారాసెటమాల్ కాలేయానికి హాని కలిగిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. యూకేలో కాలేయ వైఫల్యానికి ప్రధాన కారణాలలో పారాసెటమాల్ ఒకటని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.

 

మానవ శరీరంలో కీలకమైన అవయవం.. 


కాలేయం అనేది మానవ శరీరంలో కీలకమైన అవయవం. ఇది అన్ని శారీరక విధులు సమయానికి జరిగేలా చూస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, టాక్సిన్స్‌ను తొలగించడం, రక్త ప్రసరణ చేయడం వంటి అనేక శారీరక విధుల్లో కాలేయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన మోతాదులో పారాసెటమాల్ తీసుకోవడం హానికరం కాదు. కానీ సురక్షితమైన వినియోగాన్ని నిర్ధారించడానికి, కాలేయ ప్రమాదాన్ని తగ్గించడానికి దాని హెపాటోటాక్సిక్ ప్రభావంపై ఆధారపడుతుంది.

ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో కాలేయం దెబ్బతినడానికి పారాసెటమాల్ ఒక ముఖ్య కారణమని గుర్తించారు శాస్త్రవేత్తలు. నొప్పి, జ్వరం ఉపశమనం కోసం ఎక్కువ మోతాదులను మించి ఈ మాత్ర తీసుకుంటే కాలేయం విషపూరితమవుతుంది.   

పారాసెటమాల్ , సాధారణంగా Acetaminophen అనే పేరుతో కూడా పిలుస్తారు. సాధారణంగా తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు దీనిని ఉపయోగిస్తారు. సరైన మోతాదులో తీసుకుంటే ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. రోజుకు 4,000 మిల్లీగ్రామ్ (4 గ్రాములు) పైగా తీసుకుంటే కాలేయానికి హాని కలుగుతుంది. దీనిని అధిక మోతాదులో తీసుకుంటే ఒక్కోసారి లివర్ ఫెయిల్యూర్ కి దారితీసే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మధుమేహం లేదా కాలేయ సంబంధిత ఇబ్బందులు ఉన్న వ్యక్తులు పారా సెటమాల్ ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డాక్టర్ సలహా ప్రకారం సరైన మోతాదును తీసుకోవడమే సురక్షితమైనది. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : paracetamol-tablet liver-damage new-study liver-health liver-infection paracetamol paracetamol-side-effects hepatitis-b fatty-liver fatty-liver-symptoms temperature hepatotoxicity liver-injury severe-liver-damage paracetamol-toxicity paracetamol-risks hepatic-injury paracetamol-effects

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com