స్లీప్ పెరాలసిస్ లక్షణాలు, కారణాలు - నివారణ..

సాక్షి లైఫ్ : ప్రస్తుతం మారిన జీవనశైలి ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. దీనికరణంగా ప్రజలు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారు. అటువంటివాటిలో తీవ్రమైన సమస్య స్లీప్ పెరాలసిస్ ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్లీప్ పెరాలసిస్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. 

స్లీప్ పెరాలసిస్ కారణాలు..  

ప్రజల జీవనశైలి వేగంగా మారుతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు అనేక సమస్యల బారిన పడుతున్నారు. వీటిల్లో స్లీప్ పెరాలసిస్ కూడా ఉంది. బిజీ లైఫ్‌లో ప్రజల జీవనశైలి వేగంగా మారుతోంది.  

అలాగే, మారుతున్న ఈ జీవనశైలి కారణంగా, ప్రజలు తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

కానీ ఈ రోజుల్లో, పెరుగుతున్న ఒత్తిడితోపాటు ఇతర అలవాట్ల కారణంగా, నిద్ర పూర్తిగా తగ్గింది. దీని కారణంగా ప్రజలు అనేక రకాల నిద్ర రుగ్మతల బారిన పడుతున్నారు. స్లీప్ పెరాలసిస్ వంటి సమస్య, దీని కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.  


స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి..?

నిద్ర పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలో లేవలేడు, మాట్లాడలేడు. ఈ సమయంలో వ్యక్తి తాను స్పృహలో ఉన్నట్లు భావిస్తాడు, కానీ అతని శరీరం కదలదు. తరచుగా ఈ సమస్య లోతైన నిద్రకు ముందు లేదా మేల్కొలుపుకు కొద్దిసేపటి ముందు సంభవిస్తుంది. 

 స్లీప్ పెరాలసిస్ కి కారణాలేమిటి..?

 పిల్లల్లోనూ ,పెద్దల్లోనూ  స్లీప్ పెరాలసిస్ తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు..  

నిద్రలేమి
నార్కోలెప్సీ
ఆందోళన,
నిరాశ
బైపోలార్ డిజార్డర్
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)


 స్లీప్ పెరాలసిస్ ను నివారించడం ఎలా..?

ఇప్పటి వరకు ఈ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితిలో జీవనశైలిలో ముఖ్యమైన మార్పులను చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.  

ఒత్తిడిని తగ్గించుకోండి. 
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. 
తగినంత విశ్రాంతి అవసరం.. 
మద్యం, సిగరెట్లు లేదా ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sleep-paralysis

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com