Health at Risk : ఫ్రిజ్‌లో ఈ పదార్థాలు ఉంచుతున్నారా..? ఐతే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే..!
సాక్షి లైఫ్ : ఆహార పదార్థాలు పాడవకుండా, ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెట్టడం సర్వసాధారణం. అయితే, అన్ని రకాల పదార్థాలను ఫ్రిజ్‌లో భద్రపరచడం శ్రేయస్కరం కాదు. కొన్ని వస్తువులను అతిశీతల ఉష్ణోగ్రతల్లో ఉంచడం వల్ల వాటి రుచి, గుణం దెబ్బతినడమే కాకుండా, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఉంచకూడని పదార్థాలు, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం..
బంగాళదుంపలు - క్యాన్సర్ ముప్పు..
ఫ్రిజ్‌లో ఉండే చల్లటి వాతావరణం వల్ల బంగాళదుంపల్లోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. ఆ తర్వాత వాటిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా నూనెలో వేయించినప్పుడు 'అక్రిలమైడ్' (Acrylamide) అనే ప్రమాదకర రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఉల్లి, వెల్లుల్లి - ఫుడ్ పాయిజనింగ్..
ఫ్రిజ్‌లో ఉండే తేమ వల్ల ఉల్లిపాయలు, వెల్లుల్లికి 'బ్లాక్ మోల్డ్' అంటే నల్లటి ఫంగస్ పడుతుంది. ఇందులో ఉండే ఆస్పెర్‌గిల్లస్ ఫంగస్ శరీరంలోకి చేరితే కడుపులో ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. గోధుమ పిండి, శనగపిండి, మైదా లాంటివి తేమ ఉన్న ప్రదేశాల్లో ఉంచితే త్వరగా బూజు, పురుగులు పడతాయి. ఇలాంటి పిండితో చేసిన ఆహారం తినడం వల్ల మైకోటాక్సిన్స్ కడుపులోకి చేరి కాలేయం (liver) దెబ్బతింటుంది, జీర్ణక్రియ మందగిస్తుంది.
తేనె, వంట నూనెలు - జీర్ణ సమస్యలు..
తేనెను ఫ్రిజ్‌లో ఉంచితే అది గడ్డకట్టినట్లు మారిపోయి, అందులోని సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పూర్తిగా నశిస్తాయి. అలాగే, నూనెలు చల్లదనం వల్ల చిక్కబడిపోయి, వాటి స్వచ్ఛత, సులభంగా జీర్ణమయ్యే గుణం తగ్గిపోతాయి. టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల గుండెకు మేలు చేసే 'లైకోపీన్' అనే యాంటీ ఆక్సిడెంట్ నశిస్తుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉంచిన అరటిపండు తొక్క నల్లబడటం అంటే అందులోని పొటాషియం, విటమిన్ బి6 వేగంగా తగ్గిపోతున్నాయని అర్థం.
బ్రెడ్, బిస్కెట్లు-మలబద్ధకం.. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పొడిబారిపోయి, అందులో స్టార్చ్ క్రిస్టల్స్ ఏర్పడతాయి. ఈ బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం (bloating) వంటి సమస్యలు తలెత్తుతాయి.
వండిన ఆహారం, పాలు, పాల ఉత్పత్తులు, కోసిన పండ్లు, కూరగాయలు, మాంసం వంటి త్వరగా పాడయ్యే వాటిని మాత్రమే ఫ్రిజ్‌లో సరైన పద్ధతిలో భద్రపరచాలి. పచ్చి పదార్థాలను, వండిన పదార్థాలను ఫ్రిజ్‌లో పక్కపక్కన కాకుండా వేర్వేరుగా ఉంచాలి. అలాగే ప్రతి పదార్థాన్ని తప్పనిసరిగా మూతపెట్టి ఉంచడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
