Summer Diet Guide : వేసవికాలంలో ఏమి తినకూడదు..? ఏమి తినాలో తెలుసా..? 

షేర్ చేయండి:
Summer Diet Guide : వేసవికాలంలో ఏమి తినకూడదు..? ఏమి తినాలో తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. భానుడి భగభగలకు శరీరం త్వరగా అలసటకు గురవుతోంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ కాలంలో శరీరంలో 'పిత్త దోషం' పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సినవి, తినకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

శరీర చల్లదనం కోసం ఏమి తినాలి..? 

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే ఆహారాలే మనకు రక్ష. నీటి శాతం ఉన్న పండ్లు..పుచ్చకాయ, కర్బూజా, కివీ వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. చల్లని పాలు, పెరుగు లేదా పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి కలిపితే మరింత మేలు.

ప్రకృతి పానీయాలు.. శీతల పానీయాల (Cool Drinks) జోలికి వెళ్లకుండా.. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరకు రసం వంటి సహజ పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తేలికపాటి భోజనం..పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు, సలాడ్లు భోజనంలో భాగంగా చేసుకోవాలి.

ఎలాంటివి తినకూడదు..?  

తప్పుడు ఆహారపు అలవాట్లు శరీరంలో వేడిని మరింత పెంచుతాయి.మసాలాలు, నూనె వస్తువులు.. అధికంగా వేయించిన ఆహారాలు, ఘాటైన మసాలాలు జీర్ణం కావడం కష్టం. ఇవి కడుపులో మంటకు దారితీస్తాయి. కాఫీ, టీలు అతిగా తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు ప్రధాన కారణం.ఒకేసారి కడుపు నిండా తినకుండా.. రోజులో తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు (Small Meals) ఆహారం తీసుకోవడం ఉత్తమం.

వేసవిలో ఆహారం కేవలం ఆకలి తీర్చడానికే కాదు.. శరీరాన్ని చల్లబరిచే ఔషధంగా పని చేయాలి. వీలైనంత వరకు తాజా ఆహారాన్నే తీసుకోండి. ఎండలో ప్రయాణించేటప్పుడు వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవడం మర్చిపోవద్దు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించండి.

 

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.