సాక్షి లైఫ్ : విటమిన్ B6 లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో జీవనశైలి అలవాట్లు, రోజువారీ ఆహారపు అలవాట్లు (lifestyle habits and daily eating habits) ప్రధాన కారణంగా చెప్పవచ్చు. విటమిన్ B6 లోపాన్ని (vitamin B6 deficiency) నివారించడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్నిరకాల ఆహారాలున్నాయి.. అవి రోజువారీ ఫుడ్ మెనూలో చేర్చుకోవడం ద్వారా (prevent vitamin B6 deficiency) విటమిన్ B6 లోపాన్ని అధిగమించవచ్చు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
విటమిన్ B6 అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం.కొన్ని మందులు విటమిన్ B6ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఎక్కువ మద్యం తాగడం వల్ల విటమిన్ B6 లోపం రావచ్చు. జీర్ణ సమస్యలు (Digestive problems): కొన్ని జీర్ణ సమస్యలు కూడా విటమిన్ B6 (vitamin B6) శోషణపై చెడు ప్రభావం చూపుతాయి.
విటమిన్ B6 (vitamin B6) పుష్కలంగా ఉన్న ఆహారాలు..
కొన్ని రకాల ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల విటమిన్ B6 లోపాన్ని నివారించవచ్చు. అరటిపండులో విటమిన్ B6 (vitamin B6)పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం (potassium) రక్తపోటు (blood pressure) ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
చేపలు (Fish): సాల్మన్, ట్యూనా, మాకెరల్ వంటి చేపలలో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండి, గుండె ఆరోగ్యానికి మంచిది.
పౌల్ట్రీ: చికెన్, టర్కీ వంటి పౌల్ట్రీ ఆహారాల్లో(Poultry food) కూడా విటమిన్ B6 ఉంటుంది. ఇవి ప్రోటీన్‌కు మంచి వనరు, కండరాల నిర్మాణానికి సహాయపడతాయి.
గుడ్లు: గుడ్లలో విటమిన్ B6 తో పాటు ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక ఇతర పోషకాలు (nutrients)ఉంటాయి.
ధాన్యాలు: బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా (brown rice, oats, quinoa)వంటి తృణధాన్యాలలో విటమిన్ B6 (vitamin B6)ఉంటుంది. ఇవి ఫైబర్(fiber)కు కూడా మంచి వనరులు, ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com