Nail Color : జాగ్రత్త..! గోళ్ల రంగు, ఆకారం మారుతోందా..? అయితే ఈ అనారోగ్యాలకు ముందస్తు సంకేతం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గోళ్లను కేవలం అందానికి, శుభ్రతకు మాత్రమే ప్రతిరూపంగా భావిస్తుంటాం. కానీ వాటి రంగు, ఆకారం, ఆకృతిలో వచ్చే అసాధారణ మార్పులు మన శరీరంలో దాగి ఉన్న పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికలు కావచ్చని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

 

గోళ్ల రంగు - అవి సూచించే ఆరోగ్య సమస్యలు..

పసుపు రంగు గోళ్లు..ఇది సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. గోళ్లు పసుపు పచ్చగా మారడంతో పాటు మందంగా తయారై విరిగిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తెల్లటి గోళ్లు.. కాలేయ వ్యాధులు లేదా మధుమేహం (diabetes) బారిన పడినప్పుడు గోళ్లు పూర్తిగా తెల్లగా మారే అవకాశం ఉంటుంది.

పీలగా అంటే రంగు తగ్గి మారిన గోళ్లు..శరీరంలో ఐరన్ లోపం లేదా రక్తహీనత (anemia) ఉన్నవారిలో గోళ్లు సహజ రంగును కోల్పోయి పాలిపోయినట్లుగా కనిపిస్తాయి.

గోళ్ల ఆకృతిలో మార్పులు - ప్రధాన కారణాలు..?

పెళుసుగా, పొడిబారిన గోళ్లు.. గోళ్లు పొడిబారి, మందంగా మారి త్వరగా విరిగిపోవడానికి థైరాయిడ్ సమస్యలు ప్రధాన కారణం కావచ్చు. థైరాయిడ్ వల్ల గోళ్ల ఎదుగుదల, దృఢత్వంలో మార్పులు వస్తాయి.

గోళ్లపై లోతైన గీతలు (Beau's lines)..గోళ్ల మీద అడ్డంగా లోతైన గీతలు కనిపిస్తే.. కొంతకాలం పాటు గోళ్ల ఎదుగుదల నిలిచిపోయిందని అర్థం. తీవ్రమైన జ్వరం, గాయాలు, కీమోథెరపీ లేదా విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుంది.

గోళ్ల కింద నల్లటి గీతలు ఉంటే ప్రమాదమా..?

గోళ్ల కింద అకస్మాత్తుగా నలుపు లేదా గోధుమ రంగు గీతలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా అరుదైన సందర్భాల్లో ఇది 'మెలనోమా' (Melanoma) అనే తీవ్రమైన చర్మ క్యాన్సర్‌కు ముందస్తు సంకేతం కావచ్చు.

గోళ్లపై ఉన్న నల్లటి గీతల ఆకారం, రంగు మారుతున్నట్లు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణులను కలవాలి. నెయిల్ పాలిష్ వాడకం లేదా చిన్న గాయాల వల్ల కూడా కొన్నిసార్లు గోళ్ల రంగు మారవచ్చు. కానీ, గోళ్ల రంగు దీర్ఘకాలం పాటు అసాధారణంగా ఉంటూ.. నీరసం, అలసట వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.