నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

సాక్షి లైఫ్: నోరు చెడువాసన గా అనిపించినప్పుడు నలుగురిలో తిరగలేరు. అంతేకాదు బ్యాడ్ స్మెల్ రావడంవల్ల అతన్ని ఇతరులు వేరేలా చూస్తారు. ఇలా అవమానాలు ఎదుర్కోవడమేకాకుండా నోటి దుర్వాసనవల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  ఓరల్ హెల్త్ కూడా శరీర ఆరోగ్యంలో భాగమే.

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా వుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నలుగురిలోకి వెళ్లాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నోట్లో  దుర్వాసన రాకుండా ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 
-తమలపాకులు నాలుకమీద జిగురును హరిస్తాయి. పచ్చకర్పూరం వేసిన కిళ్లీ తింటే నోటిలో మంచి సువాసన వస్తుంది. 

-ఏలకులు, లవంగం కూడా నోటి దుర్వాసనని హరిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు నోట్లో ఏలకులు గానీ, లవంగాలు గానీ వేసుకోవడం ఉత్తమం. 

-కొబ్బరినికోరి మెత్తగా రుబ్బి పిండితే వచ్చే రసం . కొబ్బరిపాలు)లో తగినంత పచ్చకర్పూరం వేసుకొని పచ్చిగానే తాగవచ్చు. లేదా బాగా కాచి తాగవచ్చు. నోటి దుర్వాసన తగ్గుతుంది.

- గజనిమ్మకాయ నాలుగు భాగాలుగా చేసి చిన్నముక్కలుగా తరిగి, ఒక్కో ముక్కని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే నోరు శుభ్రపడ్తుంది. దుర్వాసన తగ్గుతుంది.

-జాజికాయ, జాపత్రీ, పచ్చ కర్పూరం కొద్దిగా తీసుకొని దంచి, ఎండుద్రాక్షలతోనూరి, చిన్న మాత్రలు కట్టి ఒక్క మాత్రని బుగ్గన పెట్టుకొని చప్పరించండి. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.

-దాల్చిన చెక్క బెరడు చిన్నముక్కను బుగ్గన ఉంచుకొని నములుతూ వుంటే నోరు శుభ్రంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : dental-problems dental-health teeth teeth-health oral-health-tips oral-health how-to-reduce-mouth-odour oral-care odor how-to-maintain-good-oral-hygiene how-to-get-rid-of-mouth-odor tooth-decay-odor-remedy

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com