Oil Pulling for Oral Health : ‘ఆయిల్ పుల్లింగ్’తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : దంతాలు తెల్లగా మెరవడమే కాదు, లోపలి నుంచి దృఢంగా ఉండటం సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతీక. ఆధునిక కాలంలో రకరకాల మౌత్‌వాష్‌లు, రసాయన ఆధారిత ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రాచీన ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే నోటి పరిశుభ్రతకు అద్భుతమైన మార్గాన్ని చూపింది. అందులో అత్యంత విశిష్టమైనది ‘గండూషం’ లేదా ‘కవల గ్రహం’. దీనినే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ పుల్లింగ్ (Oil Pulling) అని పిలుస్తున్నారు. దంతక్షయం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వంటి సమస్యలను సహజసిద్ధంగా అరికట్టే ఆయిల్ పుల్లింగ్ విధానం, పాటించాల్సిన నియమాల సమగ్ర సమాచారం.
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఆయిల్ పుల్లింగ్ అంటే ఏమిటి..? ఎందుకు చేయాలి..?
నోటిలో సహజమైన నూనెను పోసుకుని కొన్ని నిమిషాల పాటు దంతాల సందుల గుండా తిప్పడాన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. నూనెకు నోటిలోని కొవ్వు ఆధారిత బ్యాక్టీరియాను, విషపదార్థాలను ఆకర్షించి బంధించే గుణం ఉంటుంది. రెగ్యులర్‌గా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయే గార, పాచి క్రమంగా తగ్గుతాయి. చిగుళ్లలోకి రక్తప్రసరణ పెరిగి, చిగుళ్ల నుంచి రక్తం కారడం (gingivitis) అదుపులోకి వస్తుంది. నోటి దుర్వాసన దూరం..చెడు శ్వాసకు కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ వంటి హానికర బ్యాక్టీరియాను ఇది సమర్థంగా నియంత్రిస్తుంది.
ఆయిల్ పుల్లింగ్ సరైన విధానం..
సరైన సమయం..ఉదయాన్నే నిద్రలేవగానే, బ్రష్ చేయకముందు ఖాళీ కడుపుతో ఈ ప్రక్రియను చేపట్టడం అత్యంత ఉత్తమం. నూనె ఎంపిక..కోల్డ్ ప్రెస్డ్ గానుగ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఎంచుకోవాలి. కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీ-మైక్రోబియల్‌గా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ..సుమారు 10 నుంచి 15 మి.లీ నూనెను నోట్లో పోసుకోవాలి.
నోరు మూసి నూనెను నాలుకతో కదిలిస్తూ దంతాల సందుల గుండా నెమ్మదిగా 10 నుంచి 15 నిమిషాల పాటు తిప్పాలి. మొదట్లో కష్టంగా అనిపిస్తే 5 నిమిషాలతో ప్రారంభించి సమయాన్ని పెంచుకోవచ్చు. నూనె చిక్కదనం కోల్పోయి, తెల్లటి పాలలా మారిన తర్వాత దానిని చెత్తబుట్టలో ఉమ్మివేయాలి. ఈ నూనెను ఎట్టిపరిస్థితుల్లోనూ మింగకూడదు, ఎందుకంటే అందులో నోటిలోని విషపదార్థాలు, బ్యాక్టీరియా ఉంటాయి. నోటిని శుభ్రపరుచుకోవడం..చివరగా గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రంగా పుక్కిలించి, ఆ తర్వాత ఎప్పటిలాగే బ్రష్ చేసుకోవాలి.
ఆయుర్వేదంలో ఇతర సహజ జాగ్రత్తలు..
ఔషధ పుల్లలతో పళ్లు తోమడం..వేప, కానుగ లేదా ఉత్తరేణి పుల్లలతో పళ్లు తోమడం వల్ల వాటిలోని చేదు, వగరు రసాలు లాలాజలాన్ని శుద్ధి చేసి క్రిములను నాశనం చేస్తాయి. త్రిఫల చూర్ణాన్ని నీటిలో మరిగించి, ఆ గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలిస్తే దంతాల మూలాలు గట్టిపడతాయి. మితిమీరిన తీపి పదార్థాలు, జిగటగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. కాల్షియం, విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరి, నువ్వులు, ఆకుకూరలను నిత్య ఆహారంలో చేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
