సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

సాక్షి లైఫ్: సికిల్ సెల్ వ్యాధిని నివారించడానికి, దాని కారణాలను మొదట అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక్కోసారి ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అంటే తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ దీని బారిన పడినట్లయితే, అది పిల్లలకి కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి జన్యువు ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్త కోసం వివాహానికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా ఈ వ్యాధి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడొచ్చు..?

ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే వస్తుంది. దీనిలో ఎర్ర రక్త కణాల ఆకారం మారిపోతుంది. దీని వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు, ఎందుకంటే హిమోగ్లోబిన్‌లో అసాధారణమైన గొలుసులు ఏర్పడడంతో సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ సెల్ తలసేమియా వంటి వ్యాధులు వస్తాయి. అందువల్ల, సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు.. 

ఎముక-కండరాల నొప్పి
చేతులు,కాళ్ళలో వాపు
అలసట, బలహీనత
రక్తహీనత వల్ల శరీరం పాలిపోవడం
మూత్రపిండాల సమస్యలు
పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది
కంటి సంబంధిత సమస్యలు
సంక్రమణకు అవకాశం ఉంది

ఈ వ్యాధిని నయం చేయడం సాధ్యమేనా..?

వైద్యులు సాధారణంగా సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వ్యక్తులకు రక్తమార్పిడి అవసరమని సిఫార్సు చేస్తారు. శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్ అందనప్పుడు, దాని వల్ల కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు హైడ్రాక్సీ యూరియాని ఉపయోగిస్తారు. రానున్న కాలంలో ఈ వ్యాధి చికిత్సలో జన్యు చికిత్స ఎంతగానో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వల్ల తీవ్ర లక్షణాలున్న రోగులకు ఎంతో మేలు చేకూరనుంది.

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : blood-cells red-blood-cells blood white-blood-cells world-sickle-cell-day-2024 world-sickle-cell-day sickle-cell-day-2024 sickle-cell world-sickle-cell-awareness-day world-sickle-cell-awareness-day-2024 world-sickle-cell-awareness-day-24 symptoms-of-sickle-cell-disease sickle-cell-disease-symptoms

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com