జూనోటిక్ వ్యాధులు అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధులు జంతువుల ద్వారా వైరస్లు, బాక్టీరియా, పరాన్నజీవులు, ప్రోటోజోవా, శిలీంధ్రాల ద్వారా మనుషులకు వ్యాపించడం ద్వారా అనారోగ్యానికి గురిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి జూలై 6వతేదీన సంవత్సరం ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 జూనోటిక్ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి..?

ఈ వ్యాధులు జబ్బున పడిన జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం, శ్లేష్మం, మలం లేదా ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపిస్తాయి. అంతేకాదు ఈ వ్యాధి కింది మార్గాల్లో కూడా మనుషులకు సోకుతుంది. 

వ్యాధులు సోకిన చర్మాన్ని తాకడం ద్వారా
సోకిన జంతువులు తిన్న పదార్ధాలు, ఆహారాలను ముట్టుకోవడం 
రోగాల బారీన పడిన గాలి ద్వారా.. 

ఎలాంటి వారికి ఎక్కువ ప్రమాదం..?

క్యాన్సర్ ఉన్నవారికి
వృద్ధులు, గర్భిణీ రోగులకు 
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు 
అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలకు 
అడవి జంతువులతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : skin-problems zoonotic-diseases zoonotic-diseases-symptoms world-zoonoses-day-2024-theme world-zoonoses-day-2024 world-zoonoses-day
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com