లాలాజల ఉత్పత్తి తగ్గితే ఏం జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఏదైనా పరిమితికి మించితే ఇబ్బందే..అంటున్నారు డాక్టర్లు. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు రోజూ తగినంత మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ అతిగా మంచినీరును తాగడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా మంచినీరు తాగడం వల్ల శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు పడుతాయి. అలాంటి వాటిలో లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.. అవేంటో ఇపుడు తెలుసుకుందాం..!
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
అతిగా మంచినీరు తాగడం వల్ల..
అతిగా మంచినీరు తాగడం వల్ల పొత్తి కడుపు నొప్పి, శరీర అవయవాల వాపు లేదా పొత్తి కడుపు అమాంతం పెరిగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల సోడియం స్థాయిలు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుందని పరిశోధనల్లో తేలింది. అలా సోడియం స్థాయి తగ్గడం కారణంగా మెదడలో మంట ఏర్పడే అవకాశం ఉంది.
బ్రెయిన్ డెడ్..
ఇది ప్రమాదకర దశ. దీన్ని వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో తగినంత నీరు ఉంటే, ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు సరిపోతుంది. శరీరం తగినంతగా హైడ్రేట్ అయిందా లేదా..? అనేది ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
శరీరంలో నీరు లేకపోవడం వల్ల మన చర్మం పొడిబారడం, పెదవులు ఎండిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల ఛాతీలో కొంచెం మంట, ఆమ్లత్వం లేదా కడుపులో అసౌకర్యం ఏర్పడవచ్చు. శరీరంలో నీటి కొరత ఏర్పడడం వల్ల కండరాలలో నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల నిరంతరం తలనొప్పి వస్తుంటుంది. శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే తగినంత లాలాజల ఉత్పత్తి జరగదు. దీని వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి.. గోళ్లు కొరకడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు..?
దుర్వాసన..
లాలాజల ఉత్పత్తి తగ్గితే నోటిలో బ్యాక్టీరియా సంఖ్య పెరిగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. మూత్రం రంగు కాలక్రమేణా ముదురు లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, అది డీహైడ్రేషన్ కు సంకేతం. ఈ లక్షణాలు ఉన్న వారు రోజువారీ తాగే నీటి మోతాదును కాస్త పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు లేని వారు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. ప్రతిరోజూ నీరు ఎంత తాగాలనే విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
