IVF Important Factsమీరు 40 ఏళ్ల  తర్వాత IVF చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఈ నిజాలు తెలుసుకోండి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నలభైఏళ్లు దాటిన తర్వాత ఐవీఎఫ్ (IVF) ద్వారా గర్భం దాల్చాలనుకునే మహిళలకు, వారి వయసు కంటే అండాల వయసు (Egg age), నాణ్యతే అత్యంత కీలకమని బ్రిటన్‌లో జరిగిన ఒక భారీ అధ్యయనం స్పష్టం చేసింది. 1991 నుంచి 2018 మధ్య జరిగిన దాదాపు 12 లక్షల అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) చికిత్సలను విశ్లేషించిన పరిశోధకులు పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

వయసు, అండాల వయసు మధ్య వ్యత్యాసం.. 

మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత సహజంగానే పడిపోతాయి. మహిళలు పుట్టుకతోనే దాదాపు 10 నుంచి 20 లక్షల అండాలతో జన్మిస్తారు. రజస్వల అయ్యే సమయానికి ఇవి 3 నుంచి 5 లక్షలకు పడిపోతాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసులో అండాల నాణ్యత అత్యుత్తమంగా ఉంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత వాటి సంఖ్య, నాణ్యత వేగంగా క్షీణించి జన్యుపరమైన లోపాలు, గర్భస్రావం (Miscarriage) జరిగే ప్రమాదాలు పెరుగుతాయి.

సొంత అండాలతో తగ్గుతున్న సక్సెస్ రేటు.. 

43 ఏళ్లు లేదా ఆపై వయసున్న మహిళలు తమ సొంత అండాలతో ఐవీఎఫ్ చేయించుకుంటే విజయవకాశాలు 5 శాతం కంటే తక్కువేనని తాజా అధ్యయనంలో తేలింది. ఆధునిక వైద్య పరిజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ, వయసు పైబడిన తర్వాత సొంత అండాలతో గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

డోనర్ ఎగ్స్ తో సత్ఫలితాలు.. 

40 ఏళ్లు దాటిన మహిళల్లో సొంత అండాల కంటే, తక్కువ వయసున్న వేరే మహిళ నుంచి సేకరించిన అండాలతో (Donor eggs) ఐవీఎఫ్ సక్సెస్ రేటు మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 45 నుంచి 50 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లైన వారిలో 90 శాతానికి పైగా డోనర్ ఎగ్స్ వాడినవారే కావడం గమనార్హం. చిన్న వయసులోనే అండాలను భద్రపరచుకునే 'ఎగ్ ఫ్రీజింగ్' కూడా మరో ఉత్తమ ప్రత్యామ్నాయంగా వైద్యులు సూచిస్తున్నారు.

ఐవీఎఫ్ విజయాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు.. 

మహిళ వయసు, అండాల నాణ్యతతో పాటు ఐవీఎఫ్ సక్సెస్ కావాలంటే మరికొన్ని అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పురుషుల్లో వీర్య కణాల నాణ్యత (Sperm quality). మహిళ గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత. స్థూలకాయం (obesity), ధూమపానం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు కారణంగా.. ఐవీఎఫ్  సక్సెస్ రేట్ పై ఎఫెక్ట్ పడుతుంది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.