Bilirubin : బిలిరుబిన్ అంటే ఏమిటి..? కాలేయానికి దీనికి లింక్ ఏంటి..? 

షేర్ చేయండి:
Bilirubin : బిలిరుబిన్ అంటే ఏమిటి..? కాలేయానికి దీనికి లింక్ ఏంటి..? 

సాక్షి లైఫ్ : శరీరంలో విషతుల్యాలను తొలగించే 'ఫ్యాక్టరీ' కాలేయం. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. అయితే కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మన కళ్ళు కాలేయ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే అద్దంలా పనిచేస్తాయి. కళ్ళలో వచ్చే మార్పులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

 

కళ్ళు పసుపు రంగులోకి మారుతున్నాయా..?

సాధారణంగా కనుగుడ్ల తెల్లటి భాగం (Sclera) స్వచ్ఛంగా ఉండాలి. ఒకవేళ అది పసుపు రంగులోకి మారుతుంటే శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం పెరిగిందని అర్థం.

బిలిరుబిన్ అంటే ఏమిటి..?

 ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బిలిరుబిన్ ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయం దీనిని వడపోసి శరీరం నుంచి బయటకు పంపిస్తుంది.

ఎందుకు పెరుగుతుంది..?

కాలేయం పనితీరు మందగించినా లేదా ఇన్ఫెక్షన్లకు గురైనా, ఈ బిలిరుబిన్‌ను తొలగించలేకపోతుంది. ఫలితంగా అది రక్తంలో పేరుకుపోయి కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. దీనినే మనం కామెర్లు (Jaundice) అని పిలుస్తాం.

కామెర్లను అశ్రద్ధ చేయకండి.. 

కళ్ళు పసుపు రంగులోకి మారడం కేవలం సాధారణ బలహీనత కాదు. ఇది హెపటైటిస్, ఫ్యాటీ లివర్ లేదా కాలేయ వాపు వంటి తీవ్ర సమస్యలకు సంకేతం కావచ్చు.కళ్ళతో పాటు మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, విపరీ తమైన నీరసం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.కళ్ళ పైన లేదా కింద చిన్నపాటి పసుపు రంగు కొవ్వు గడ్డలు కనిపిస్తుంటే దానిని క్సాంతెలాస్మా అంటారు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ అసమతుల్యతను సూచిస్తుంది. కాలేయం కొవ్వును సరిగ్గా జీర్ణం చేయలేనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కళ్ళ చుట్టూ చర్మం పొడిబారడం, వాపు కూడా కాలేయ సమస్యల లక్షణాలే.

కాలేయం పదిలంగా ఉండాలంటే..?

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు కాలేయాన్ని దెబ్బతీస్తు న్నాయి. కాలేయాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

సరైన ఆహారం..

ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేయించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, చక్కెర కలిగిన పానీయాలకు దూరంగా ఉండాలి.

మద్యపానానికి స్వస్తి.. 

అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ కణాలు దెబ్బతిని సిర్రోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరుతాయి.

బరువు నియంత్రణ..

అధిక బరువు వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' సమస్య వస్తుంది.

టీకాలు..

హెపటైటిస్ ఏ, బి వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. కాలేయ వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపవు. అందుకే కళ్ళలో వచ్చే చిన్న మార్పులను కూడా గుర్తించి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమ మార్గం.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com