సిండమిక్‌ అప్రోచ్‌ అంటే ఏమిటి..? నివారణ ఎలా..?  

సాక్షి లైఫ్ : క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు కొందరు. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉంటాయి. అటువంటివాటిలో ఆస్టియోపోరోసిస్, హార్ట్‌ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్‌ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాలి. దీనినే "సిండమిక్‌ అప్రోచ్‌" అంటారు. 

ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

నిర్ధారణ ఎలా అంటే..? 

స్పైరోమీటర్‌ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్‌ లేదా సివియర్‌గా ఉందా..? లేదా..? అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందే.. బాధితులను వ్యక్తిగతంగా, క్లినికల్‌గా పరీక్షించడంద్వారా డాక్టర్లకు కొంత ప్రాథమిక అవగాహన వస్తుంది. 

ఇలా చేసే క్లినికల్‌ పరీక్షల్లో బాధితుల ప్రొఫెషనల్‌ హజార్డ్స్‌ను బట్టి, వారు పనిచేసే చోటు, వారుండే చోట్లలో కాలుష్య ప్రభావం, పొగతాగడం లాంటి వారి అలవాట్లు..ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్‌ అనే పరికరం తొలిదశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 

చికిత్స ఎలా..?  
   
ఈ వ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడ దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా, సమర్థంగా అదుపు చేయవచ్చు. పీల్చగానే వాయునాళాలను వెడల్పు చేసి, శ్వాసను సాఫీగా జరిగేలా చేసే  ‘బ్రాంకోడయలేటర్స్‌’ (ఇన్‌హేలర్స్‌ లేదా నెబ్యులైజర్స్‌)ను ఉపయోగిస్తారు. 

మొదట చెప్పినట్టు ఇది కాస్త దీర్ఘకాలం చేయాల్సిన చికిత్స. కాబట్టి దగ్గు వంటి లక్షణాలు కాస్త తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించిన విధంగా ఫాలోఅప్‌కు వెళ్తూ చికిత్స కొనసాగించాలి. 
నాన్‌ ఫార్మలాజికల్‌ థెరపీ: సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లోపల కఫం పేరుకు΄ోతుంది. కాబట్టి దానిని క్లియర్‌ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. 

హోమ్‌ ఆక్సిజన్‌ థెరపీ.. 

ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటలపాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 
పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్‌ : ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్‌ లిప్‌ బ్రీతింగ్‌), అబ్డామినల్‌ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్‌ స్ట్రెందెనింగ్‌) వ్యాయామాలు చేయాలి.
 
 
ఎలాంటి జాగ్రత్తలు కావాలి..?  

పొగతాగే అలవాటుంటే దాన్ని పూర్తిగా మానేయాలి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం (కళ్లె) మరింత ఎక్కువగా పెరుగుతూపోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : lungs-diseases treatment medicines what-is-copd copd what-is-copd-like what-causes-copd what-are-copd-symptoms copd-end-of-life-what-to-expect how-common-is-copd novartis-copd pulmonary-rehabilitation

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com