వెన్నెముక సమస్యలు రాకుండా ఏం చేయాలంటే..?
సాక్షి లైఫ్ : వెన్నెముక సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వెయిట్ లిఫ్టింగ్, యోగా, మెడిటేషన్, స్ట్రెచింగ్, కార్డియో వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కార్యకలాపాల ద్వారా వెన్నుపామును ఫ్లెక్సిబుల్‌గా, బలంగా ఉంచడానికి వీలవుతుంది. ఇందుకోసం ప్రధానంగా ఎక్కువ సమయం పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించడం మానేయాలి. అంతేకాదు కూర్చున్నప్పుడు ముందుకు వంగి ఉండ అలవాటును వదులుకోవాలి. సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు, మీరు నాణ్యమైన కుర్చీని ఉపయోగించడం ద్వారా మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి..మొబైల్,ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? ఈ వ్యాధులు తప్పవు..
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
కూర్చునే భంగిమ..
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది గంటల తరబడి ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారు. ఒకే భంగిమలో నిరంతరం కూర్చోవడం వల్ల వెన్నెముక సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో వెన్నెముక సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఎక్కువసేపు కూర్చొని పని చేసే సమయంలో కొద్దిపాటి విరామం తీసుకుంటూ ఉండాలని వారు చెబుతున్నారు. రెగ్యులర్ గా స్ట్రెచెస్, ఎక్సర్ సైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేస్తే వెన్ను కండరాలు స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతేకాదు వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
