Fitness Mantra: ఫిట్నెస్ మంత్రం : నెమ్మదిగా నడవడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక లక్ష్యం వైపు పరుగెత్తడం మనకు అలవాటుగా మారింది. పని ఒత్తిడి, బాధ్యతలు, పోటీ ప్రపంచంలో పడి మన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను, వర్తమాన క్షణాలను ఆస్వాదించడమే మర్చిపోతున్నాం. జీవితంలో ఎప్పుడూ పరుగెత్తడమే కాదు.. కాస్త వేగాన్ని తగ్గించి, మనశ్శాంతిగా గడపడం కూడా ముఖ్యమేనని గుర్తు చేస్తోంది. ఎటువంటి నిర్దిష్ట గమ్యం, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నడవడం వల్లనే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

అసలు 'విహారం' అంటే ఏమిటి..?

ఎలాంటి తొందరపాటు, మానసిక ఒత్తిడి లేకుండా తీరికగా, హాయిగా నడవడాన్నే 'విహారం' అంటారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం. పక్షుల కిలకిలారావాలు వినడం, చెట్ల పచ్చదనాన్ని ఆస్వాదించడం, స్వచ్ఛమైన గాలిని పీల్చడం, ప్రకృతితో మమేకమవడం ఇందులో భాగం.

1979లో అమెరికాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ నిపుణుడు డబ్ల్యూ.టి. రాబే విహార దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో జాగింగ్ విపరీతంగా ప్రజాదరణ పొందుతున్న తరుణంలో.. ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో, జీవితాన్ని ఆస్వాదించడానికి అప్పుడప్పుడు నెమ్మదిగా నడవడం కూడా అంతే ముఖ్యమని ఆయన విశ్వసించారు.

నెమ్మదిగా నడవడం వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..

శరీరాన్ని శ్రమ పెట్టకుండా, కీళ్లపై ఎలాంటి అదనపు ఒత్తిడి పడకుండా సాగే ఈ సున్నితమైన నడక.. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం,రక్త ప్రసరణ..

నెమ్మదిగా నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తపోటును (bp) నియంత్రణలో ఉంచుతుంది.

మెరుగైన జీర్ణక్రియ, నిద్ర..

క్రమం తప్పకుండా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. రాత్రి వేళల్లో నాణ్యమైన నిద్ర పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

మానసిక ప్రశాంతత.. 

నడక మనల్ని వర్తమానంలో జీవించేలా చేస్తుంది. రేపటి గురించిన ఆందోళనలను దూరం చేసి, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ను అందిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతాయి.

సహజ ఒత్తిడి నివారిణి..!

"ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు సహజ సిద్ధమైన వాతావరణంలో నెమ్మదిగా నడవడం వల్ల మెదడులో సెరోటోనిన్, డోపమైన్ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. అంతేకాకుండా, ఈ అలవాటు మధుమేహం (diabetes) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది. నడకను శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన సహజ ఔషధంగా భావించవచ్చు."-వైద్య నిపుణులు

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గ్రహించి, బిజీ షెడ్యూల్ నుంచి రోజుకు కనీసం ఓ అరగంట సమయాన్ని ప్రకృతి ఒడిలో నడవడానికి కేటాయిద్దాం.. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం..!

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.