Suffering from Foot Pain..? : పాదాల నొప్పులు వేధిస్తున్నాయా..? విటమిన్ డి, బి12 లోపాలే కారణం కావచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేచి అడుగు తీసి అడుగు వేయాలంటే మడమల్లో తీవ్రమైన నొప్పా? కాళ్లల్లో తరచూ తిమ్మిర్లు, కండరాలు పట్టేయడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తోందా? అయితే, వీటిని కేవలం అలసటగానో, వృద్ధాప్య లక్షణాలుగానో భావించి అశ్రద్ధ చేయకండి. మన శరీరంలో తలెత్తే విటమిన్లు, పోషకాల లోపాలను పాదాలు ముందే హెచ్చరిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12 వంటి కీలక పోషకాల లోపం వల్ల పాదాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

  విటమిన్ 'డి' లోపం కావొచ్చు..!

శరీరంలో ఎముకల పటిష్టతకు, కండరాల బలానికి విటమిన్ డి అత్యంత కీలకం. మనం తీసుకునే ఆహారం నుండి కాల్షియం, ఫాస్ఫరస్‌లను శరీరం సరిగ్గా గ్రహించాలంటే ఈ విటమిన్ తప్పనిసరి.

లక్షణాలు ఎలా ఉంటాయి..? పిక్కలు, చీలమండలంలో (Ankle) నిరంతరం అసౌకర్యం లేదా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి ప్రధాన సంకేతం.

ప్రభావం.. ఈ లోపం తీవ్రమైతే కండరాల బలహీనత పెరుగుతుంది. ఫలితంగా నడవడానికి, మెట్లు ఎక్కడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ఎముకల్లో అంతర్గతంగా లోతైన నొప్పి వేధిస్తుంది.

 

కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు.. విటమిన్ 'బి12' హెచ్చరిక..!

నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తికి విటమిన్ బి12 ఎంతో అవసరం. ఈ విటమిన్ లోపించినప్పుడు నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..? కాళ్లు, అరికాళ్లలో నిరంతరం జలదరింపు, తిమ్మిర్లు రావడం, సూదులు గుచ్చినట్లు అనిపించడం లేదా విపరీతమైన మంటలు పుట్టడం దీని ప్రధాన లక్షణాలు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ అంటే..?

 సాధారణంగా మాంసాహారం తీసుకోని శాకాహారులు (Vegetarians), వృద్ధులు, మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో విటమిన్ బి12 లోపం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

ఇతర పోషకాల లోపాలు-కాళ్లపై చూపే ప్రభావం..  

మన శరీరంలో విటమిన్లతో పాటు కొన్ని కీలక ఖనిజ లవణాలు (Minerals) లోపించినప్పుడు కూడా కాళ్ల నొప్పులు వస్తాయి.

ఖనిజ లవణాల లోపాలు-కాళ్లపై చూపే ప్రభావం..  

మన శరీరంలో విటమిన్లతో పాటు కొన్ని కీలక ఖనిజ లవణాలు (Minerals) లోపించినప్పుడు కూడా కాళ్ల నొప్పులు వేధిస్తాయి. ముఖ్యంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడితే, కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల కొద్ది దూరం నడవగానే కాళ్లు బరువుగా అనిపించడం, తీవ్రమైన అలసట రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, కొందరిలో కాళ్లు నిలకడగా లేకపోవడం అంటే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే రుగ్మత కూడా కనిపించవచ్చు. మరోవైపు, కండరాలు, నరాల సాధారణ పనితీరుకు అవసరమైన మెగ్నీషియం లోపిస్తే.. రాత్రి వేళల్లో తరచూ పిక్కలు పట్టేయడం (Muscle Cramps), కాళ్లల్లో బలహీనత వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే శరీరంలో కీలక ఎలక్ట్రోలైట్‌గా పనిచేసే పొటాషియం లోపం వల్ల కండరాల తీవ్రమైన నొప్పులు, నీరసం, నడవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు, నిరంతర నొప్పులు లేదా బలహీనత వంటి లక్షణాలు కొన్ని రోజుల పాటు వరుసగా వేధిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సరైన రక్త పరీక్షల ద్వారా ఏ పోషకం లోపించిందో ముందే తెలుసుకుని, నిపుణుల సలహాతో తగిన చికిత్స లేదా సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.