స్వీట్ కార్న్ సూప్ శీతాకాలంలో ఎందుకు తీసుకోవాలి అంటే..? 

సాక్షి లైఫ్ : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక్కో సీజన్ ను బట్టి మనం తీసుకునే ఆహారంలో కొన్నిరకాల మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో స్వీట్ కార్న్ సూప్ అనేది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఎంపిక. చలి కాలంలో దీన్ని ఖచ్చితంగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే..? ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఈ సూప్ లో ఉండే పోషకాలు  శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు శీతాకాలంలో ఫిట్‌గా ఉండడమేకాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.

 శీతాకాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ మొక్కజొన్న తినడానికి ఇష్టపడుతారు. దీని నుంచి అనేక రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారుచేసుకుని తింటారు. పెళ్లిళ్లు, చిన్న పార్టీలు ఇలా ప్రతి సందర్భంలోనూ మొక్కజొన్నతో చేసిన స్నాక్స్‌ను చాలా మంది ఇష్టపడతారు. మొక్కజొన్నలో ఉండే విటమిన్ ఏ, బి, ఇ, ఇతర పోషకాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చలికాలం విషయానికి వస్తే, శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి సూప్‌ని మించిన ఎంపిక మరొకటి ఉండదు. చలికాలంలో మొక్కజొన్న సూప్‌ను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.  

ఇది కూడా చదవండి..శీతాకాలంలో ముల్లంగి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరచడమేకాకుండా జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి12, ఐరన్ , యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు స్వీట్ కార్న్‌లో పుష్కలంగా లభిస్తాయి.  

 

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

 

గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : winter-season sour-foods winter-foods soup why-eat-soup-in-winter what-soup-to-eat-in-winter why-drink-soup-in-winter why-make-soup-in-winter eat-soup-for-winter-wellness vegetable-soup healthy-soup soup-recipe sweet-corn-soup-recipe how-to-eat-soup-elegant how-to-eat-soup-elegantly how-to-make-soup winter-soup soup-for-winter soup-for-winter-season soup-weather winter-soup-recipes soups-for-winter which-soup-is-best-for-winter easy-vegetable-soup how-to-make-vegetable-soup
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com