ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టాల్సిన అవసరం లేదని మీకు తెలుసా..? అవును ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నడక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాకింగ్ చేయడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

 ఆరోగ్యానికి 30 నిమిషాల నడక.. 

నడక అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ కేవలం 30 నిమిషాల నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? నేటి బిజీ లైఫ్‌లో కొందరు కనీసం ముప్పై నిమిషాలు కూడా నడవలేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారీన పడుతున్నారు. రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల ఆయా సమస్యలను సులభంగా, సమర్థవంతంగా పరిష్కారించుకోవచ్చు.  

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..

గుండె ఆరోగ్యానికి వరం.. 

రోజూ 30 నిమిషాల నడక గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె కండరాలను దృఢంగా ఉంచడమేకాకుండా,బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్ వాకింగ్ కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి, శరీరంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలోనూ, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది నడక. టైప్-2 డయాబెటిస్‌ను నివారించడానికి, ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నడక అనేది ఎముకలు, కండరాలను బలపరచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారిస్తుంది.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.