videos
మెదడు కణితులకు జన్యుపరమైన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మెదడు కణితులు అంటే మెదడులోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరిగి ఒక గడ్డగా మారడం. ఈ కణాల పెరుగుదల వెనుక ఖచ్చితమైన కారణాలు చాలావరకు తెలియవు. అయితే, కొన్ని అంశాలు మెదడు కణితులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.. అటువంటి వాటిలో..
జన్యుపరమైన కారణాలు..
చాలా తక్కువ శాతం (5-10% కంటే తక్కువ) మెదడు కణితులు వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జన్యుపరమైన సిండ్రోమ్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, న్యూరోఫైబ్రోమాటోసిస్ 1 & 2 (NF1, NF2), ట్యూబరస్ స్క్లెరోసిస్ కాంప్లెక్స్ వంటివి. తీవ్రమైన తలనొప్పి ఉంటే, దాని అర్థం మెదడు కణితి ఉందనా..? మెదడు కణితులకు ప్రధాన కారణాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరో సర్జన్ డా. వి బ్రహ్మ ప్రసాద్ మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
