AI Revolution : బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో ఏఐ సరికొత్త విప్లవం..
సాక్షి లైఫ్ : బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త విప్లవం సృష్టిస్తోంది. సాధారణ స్క్రీనింగ్‌తో పోలిస్తే ఏఐ సహాయంతో చేసే మమ్మోగ్రామ్ పరీక్షలు అత్యంత ఖచ్చితంగా క్యాన్సర్‌ను గుర్తిస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన తాజా పరిశోధనలో వెల్లడైంది. సుమారు లక్ష మంది మహిళలపై నిర్వహించిన ఈ భారీ ప్రయోగాత్మక పరిశోధన (Clinical Trial) ఫలితాలు వైద్య రంగంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఈ పరిశోధనలో..
స్వీడన్‌లోని శాస్త్రవేత్తలు లక్ష మందికి పైగా మహిళలను రెండు గ్రూపులుగా విభజించి వారిపై ప్రత్యేకంగా అధ్యయనం చేపట్టారు. గ్రూప్ వన్ లో వారికి సాధారణ పద్ధతిలో మామోగ్రామ్ స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రూప్ టు వారికి ఏఐ (AI) సాఫ్ట్‌వేర్ సహాయంతో స్క్రీనింగ్ చేశారు. ఈ రెండు గ్రూపులకు చెందిన మహిళల సగటు వయస్సు 54 ఏళ్లు. వీరిని రెండేళ్ల పాటు నిశితంగా పరిశీలించిన తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ పద్ధతిలో మిస్ అయ్యే క్యాన్సర్ కణితులను కూడా ఏఐ అత్యంత వేగంగా, ఖచ్చితంగా పసిగట్టింది.
తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించడంలో విఫలమై, ఆ తర్వాత వ్యాధి ముదిరిన స్థితిలో బయటపడే (Later Diagnoses) కేసుల సంఖ్య ఏఐ వాడకం వల్ల 12 శాతం తగ్గింది. మమ్మోగ్రామ్ రిపోర్టులను విశ్లేషించే రేడియాలజిస్టుల పనిభారాన్ని ఏఐ గణనీయంగా తగ్గించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏఐ ఎందుకు ప్రత్యేకం..?
సాధారణంగా మమ్మోగ్రామ్ చిత్రాలను చూసేటప్పుడు మానవ కళ్లకు కనిపించని అతి సూక్ష్మమైన మార్పులను ఏఐ అల్గారిథమ్స్ పసిగడతాయి. దీనివల్ల వ్యాధి ప్రాథమిక దశలోనే బయటపడి, చికిత్స సులభతరం అవుతుంది.
ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల ప్రాణాపాయం తగ్గడమే కాకుండా, కఠినమైన కీమోథెరపీ వంటి చికిత్సల అవసరం కూడా తగ్గుతుందని పరిశోధన బృందం అభిప్రాయ పడింది. వ్యాధి ముదిరిన తర్వాత బాధపడటం కంటే, సాంకేతికతను వాడుకుని ముందే అప్రమత్తం కావడం మేలని స్వీడన్‌కు చెందిన తాజా పరిశోధన నిరూపించింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అన్ని స్క్రీనింగ్ సెంటర్లలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది.
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
