కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : గుండె ఆగిపోవడం అంటే గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోవడమే. దీని వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరిగా చేరదు. దీని కారణంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఆసమయంలో గుండె సరిగ్గా పనిచేయదు. అందుకే దీన్ని "హార్ట్ ఫెయిల్యూర్" లేదా "కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్" అని కూడా అంటారు.
గుండె హార్ట్ ఫెయిల్యూర్ కు కారణాలేంటి..?
గుండె కండరాలు చాలా బలహీనంగా మారడం వల్ల అవి సరిగ్గా సంకోచించుకోలేవు, దీని కారణంగా రక్తం ఊపిరితిత్తులకు చేరుకోలేదు. ఒక్కోసారి గుండె కండరాలు దృఢంగా మారడం కారణంగా కూడా హార్ట్ ఫెయిల్యూర్ జరగవచ్చు. దీని కారణంగా గుండెకు రక్తం అందదు కాబట్టి అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు కారణాల వల్ల గుండె ఆగిపోయే అవకాశం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
బలహీనత, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు,వేళ్లు నీలం రంగులోకి మారడం, నిటారుగా పడుకోవడంలో ఇబ్బంది, బలహీనంగా అనిపించడం దీని లక్షణాలు.
ఇది కూడా చదవండి.. మంకీ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
