Skin Health Care : చర్మ కాంతిని పెంచే అద్భుతమైన పోషకాహారం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చర్మ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేదు. ఇది మన సంపూర్ణ ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. చర్మ సంరక్షణ అనేది కేవలం శరీరంపైపూత క్రీమ్స్ పూయడం కాదని, ఇది లోపలి నుంచి, మన రోజువారీ ఆహార ఎంపికలతో ప్రారంభమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. Dengue: డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..? 

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..? 

 

ఈ నేపథ్యంలో, విటమిన్ "ఇ", ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే కాలిఫోర్నియా బాదం వంటి ఆహారాలు చర్మ ఆరోగ్యానికి అద్భుతమైన మద్దతు అందిస్తాయని డా. గీతిక మిట్టల్ గుప్తా, మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన రితికా సమద్దర్ వంటి నిపుణులు, ప్రముఖ తారలు సోహా అలీ ఖాన్, శ్రియా శరన్‌లు వెల్లడిస్తున్నారు.

బాదంలో ఉండే 15 ముఖ్యమైన పోషకాలు, ముఖ్యంగా విటమిన్ "ఇ", యాంటీ-ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండి, ముడతలను నివారించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం, సిద్ధ, యునాని వంటి సాంప్రదాయ పద్ధతులు కూడా బాదంను చర్మ కాంతికి, ఆరోగ్యానికి ప్రాచీన కాలం నుండి గుర్తిస్తున్నాయి. అంతేకాకుండా, బాదంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యువీబీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

బాదం పప్పులు కేవలం పోషకాలకు నిలయమే కాదు, వాటిని రకరకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. నేరుగా తినడం, నానబెట్టుకుని లేదా వేయించుకుని తినడం, స్మూతీలు, సలాడ్‌లు, డెజర్ట్‌లు,సాంప్రదాయ వంటకాలలో జోడించడం ద్వారా సులభంగా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, కాలిఫోర్నియా బాదం వంటి చర్మ-స్నేహపూర్వక ఆహారాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం పోషణ అవసరాన్ని గుర్తించాలని, ఫిట్‌నెస్ మాస్టర్ యాస్మిన్ కరాచీవాలా చెప్పారు. జంక్ ఫుడ్ తినాలనే కోరికలను అరికట్టడంలో కూడా బాదం అద్భుతంగ ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.  

ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.