సాక్షి లైఫ్ : క్యాన్సర్ వంటి మహమ్మారిని జయించి, కొత్త జీవితాన్ని ప్రారంభించామన్న ఆనందంలో ఉన్న రోగులకు తాజా పరిశోధనలు షాకిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స పొందిన వారిలో భవిష్యత్తులో 'రక్త క్యాన్సర్' వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతోందని జపాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ చికిత్స తీసుకున్న వారిలో ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ వైద్య పత్రిక 'క్యాన్సర్' వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
అసలేమిటీ టి.ఏ.ఎం.ఎల్ (tAML)..?
క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి చేసే కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ వల్ల వచ్చే కొత్త రకం బ్లడ్ క్యాన్సర్‌నే 'థెరపీ రిలేటెడ్ అక్యూట్ మైలోయిడ్ లుకేమియా' (tAML) అని పిలుస్తారు. కఠినమైన చికిత్సల వల్ల రోగి శరీరంలోని సాధారణ కణాల డీఎన్ఏ (DNA) దెబ్బతినడమే ఈ కొత్త రకం క్యాన్సర్‌కు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది రక్తం, ఎముక మజ్జపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఒసాకా అధ్యయనంలో దిగ్భ్రాంతికర అంశాలు..
జపాన్‌లోని ఒసాకా క్యాన్సర్ రిజిస్ట్రీ నుంచి 1990 నుంచి 2020 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 9,841 మంది బ్లడ్ క్యాన్సర్ రోగుల డేటాను పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. మొత్తం బ్లడ్ క్యాన్సర్ బాధితుల్లో 6.5 శాతం మంది అంటే 636 మంది) ఈ 'tAML' బారిన పడినట్లు గుర్తించారు.1990లో ప్రతి లక్ష మంది జనాభాకు ఈ వ్యాధి వచ్చే రేటు కేవలం 0.13 శాతంగా ఉండగా, 2020 నాటికి అది 0.36 శాతానికి పెరిగింది. అంటే మూడు దశాబ్దాల్లో ఈ ముప్పు దాదాపు మూడు రెట్లు పెరిగింది.
రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనే ఎక్కువ..
గతంలో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స ద్వారా కోలుకున్న మహిళల్లో ఈ బ్లడ్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చికిత్స తర్వాత కూడా రోగులు తమ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. క్యాన్సర్ చికిత్స ముగిసిన తర్వాత కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు (Follow-up checkups) చేయించుకోవడం వల్ల ఇలాంటి ముప్పులను తొలి దశలోనే గుర్తించి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com