సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందించడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాల తర్వాత తమ ఆహారం విషయంలో ప్రత్యేక ఆహారాలను చేర్చుకోవాలి. మహిళల శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్లో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, మహిళలు ముఖ్యంగా తమ ఆహారంలో దీనిని భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిరకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా జింక్ లోపం నుంచి బయట పడవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.