యూరిక్ యాసిడ్ సమస్యకు సరైన పరిష్కారం ఇవి.. 

షేర్ చేయండి:
యూరిక్ యాసిడ్ సమస్యకు సరైన పరిష్కారం ఇవి.. 

సాక్షి లైఫ్ : శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగపోవడం అనేది ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య, మురికి శరీరంలో పేరుకుపోతుంది ఈ యూరిక్‌ యాసిడ్‌. దీని కారణంగా కీళ్ల సమస్యలు లేదా శరీరంలోని ఇతర భాగాలపై కూడా వచ్చే అవకాశముంటుంది. అందుకే యూరిక్ యాసిడ్ నియంత్రణ చాలా ముఖ్యమవుతుంది. వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.  అధిక యూరిక్‌ యాసిడ్‌ సమస్య నుంచి బయట పడడం కోసం మీ ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చని వారు అంటున్నారు.

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు తలెత్తుతాయి.


డ్రై ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజలు యూరిక్ యాసిడ్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్కసారి పెరిగితే అదుపు చేయడం చాలా కష్టం. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్లలో నొప్పి, వాపు, లేచి కూర్చోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 అధిక యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతుంటే డ్రై ఫ్రూట్స్‌ని తినడం ద్వారా నియంత్రించుకోవచ్చు.


జీడిపప్పు.. 

పోషకాలు పుష్కలంగా ఉండే జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుంది. ఇది కాకుండా, జీడిపప్పులో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.  ఇవి ఇతర అనారోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వాల్‌నట్స్‌లో తగినంత పరిమాణంలో ఉంటాయి. యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారికి జీడిపప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బాదం.. 

బాదంపప్పు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ "ఇ", మెగ్నీషియం ,మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కాకుండా, బాదం పొట్టులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఖర్జూరం..  

  ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఖర్జూరాన్ని తప్పనిసరిగా తినాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పిస్తాపప్పు.. 

పిస్తాపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అంతేకాదు జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో తక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది, కాబట్టి ఇది యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.