తిప్పఆకు, తులసి ఆకు నిజంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయా..?
సాక్షి లైఫ్ న్యూస్: రోగనిరోధక శక్తిని పెంచడంలో జీవనశైలి మార్పులు, ఆహారం, వ్యాయామం,యోగా వంటివి ఉపయోగపడతాయి. ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం అద్భుతమైన చికిత్సలను అందిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పలు ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. అవేంటంటే..?
తులసి :
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ , సి, జింక్ , కాల్షియం పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తులసి ఆకులు శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తులసి ఆకులను ఉదయం పూట, డికాక్షన్ రూపంలో లేదా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
తిప్ప ఆకు: దీనినే ఇంగ్లిష్ లో "గిలోయ్" అని అంటారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. తిప్పఆకును జ్యూస్ రూపంలోగానీ, ఆకురూపంలో గానీ తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ఉసిరికాయ:
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ , ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండే ఉసిరి పోషకాలు ఇందులో ఉంటాయి. పచ్చి ఉసిరికాయను తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.
పసుపు:
పసుపు క్రియాశీల సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. అందుకే మనం ప్రతి రోజూ తినే కూరల్లో సైతం వేస్తుంటారు. వేడి పాలలో పసుపు పొడిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కలవాల్సిన పోషకాలు, రోగనిరోధక శక్తి అందుతుంది.
అశ్వగంధ:
అశ్వగంధ ఇది సహజంగా లభించే ఆయుర్వేద మూలిక, ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్లు, శక్తి, కాల్షియం,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అశ్వగంధ పేస్ట్‌ను గానీ పొడిని గానీ పాలతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి.
