గుజరాత్‌లో తీవ్రమవుతున్న చాందీపురా వైరస్..
సాక్షి లైఫ్ : గుజరాత్‌లో జూలై నుంచి ఇప్పటి వరకు చాందీపురా వైరస్ కారణంగా 28 మంది చిన్నారులు చనిపోయారు. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ తెలియజేశారు. చాందీపురా వైరస్ లక్షణాలు ఫ్లూ లా ఉంటాయి. ఇది దోమలు, పేలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. ఈ చాందీపురా వైరస్ మెదడువాపునకు కారణమైంది. దీంతో 14 ఏళ్లలోపు చిన్నారులు 101 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి..
ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..
ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..?
చాందీపురా వైరస్ మొదటి కేసు జూలైలో నమోదైంది. దీనిబారిన పడి ఇప్పటివరకూ 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 28 మంది పిల్లలు మరణించారు. గుజరాత్ అసెంబ్లీ బుధవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
ఆప్ ఎమ్మెల్యే ఉమేష్ మక్వానా ప్రశ్న'పై ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ స్పందిస్తూ, గుజరాత్‌లో ఇప్పటివరకు 164 వైరల్ ఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయని సభకు తెలిపారు. ఇందులో ఇన్ఫెక్షన్ కారణంగా 101 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన ఈ 164 కేసుల్లో 61 కేసులు చాందీపురా వైరస్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
