చాందీపురా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : చాందీ పురా వైరస్‌లో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. రోగికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. తీవ్ర జ్వరం వస్తుంది. ఇది 103-104 డిగ్రీలు వరకూ వస్తుంది. జ్వరం తర్వాత వాంతులు అవుతాయి. కొంత సమయం తర్వాత పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీనిని అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్) అంటారు. ఇది ఏఈఎస్ వైరస్‌లు , నాన్-వైరస్‌ల వల్ల కూడా సంభవించవచ్చు. 60 శాతం కేసులలో ఈ ఏఈఎస్ వైరస్‌ను గుర్తించలేమని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ)తో సహా అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (ఏ ఈ ఎస్) అనేది అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవులు, స్పిరోచెట్‌లు, రసాయన, విషపదార్థాలు మొదలైన వాటి వల్ల కలిగే ఒక విధమైన న్యూరోలాజికల్ సమస్య. ఇలాంటి వైరస్లు కాలానుగుణంగా మార్పు చెందుతుంటాయి.
మెదడు వాపు..
చాందీపూర వైరస్ నేరుగా మెదడులోకి వెళుతుంది. అప్పుడు మెదడులో ఇన్ఫెక్షన్ అవుతుంది. దీనికారణంగా మెదడు వాపు వస్తుంది. వాపు సంభవించిన తర్వాత, రోగిలో మూర్ఛ , తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
