తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. ఎందుకంటే..?
సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద నిరుపేదలకు అందుతున్న వైద్య సేవలకు ఈరోజు నుంచి (సెప్టెంబర్ 16) తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ జాప్యంపై తీవ్ర ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. సుమారు రూ. 1300 నుంచి 1400 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో, ఆసుపత్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, దీంతో సేవలను నిలిపివేయక తప్పడం లేదని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టిఏఎన్ హెచ్ఏ) తెలిపింది.
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ప్రభుత్వంతో చర్చలు జరిపినా..
గత కొంతకాలంగా ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా, తమ సమస్యలకు పరిష్కారం లభించలేదని టిఏఎన్ హెచ్ఏ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించినా, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో, ఆసుపత్రులు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
గతంలోనూ పలుమార్లు సేవలు నిలిపివేస్తామని హెచ్చరించినా, ప్రభుత్వం ఇచ్చిన హామీలతో వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే, ఈసారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సేవలను పునఃప్రారంభించేది లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
