Air pollution : భారత్ లో వాయు కాలుష్యంతో 17 లక్షల మందికి పైగా బలి..  

షేర్ చేయండి:
Air pollution : భారత్ లో వాయు కాలుష్యంతో 17 లక్షల మందికి పైగా బలి..  

సాక్షి లైఫ్ : భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక కొత్త, సంచలన నివేదిక ప్రకారం, కాలుష్యం వల్ల దేశంలో 17 లక్షలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అడవుల్లో మంటలు, శిలాజ ఇంధనాలను (Fossil Fuels) కాల్చడం వల్ల గాలిలో విషం పేరుకుపోయి ఈ తీవ్ర నష్టం జరిగిందని నివేదిక స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..పంచదార, తేనె, మాంక్ ఫ్రూట్ లలో.. ఆరోగ్యకరమైన స్వీటెనర్ ఏది..?

ఇది కూడా చదవండి..New study : బోన్ స్ట్రెంత్ విషయంలో గట్ హెల్త్ పాత్ర కీలకం..

ఇది కూడా చదవండి..ఏట్రియల్ కార్డియోమయోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

  PM 2.5 కాలుష్యమే ప్రధాన కారణం.. 

మానవ కార్యకలాపాల ద్వారా వెలువడే అత్యంత ప్రమాదకరమైన PM 2.5 కాలుష్యం, 2022లో భారతదేశంలో 17 లక్షల 18 వేల మంది మరణాలకు కారణమైంది. ఇది 2010 నుంచి ఏకంగా 38 శాతం పెరుగుదల కావడం గమనార్హం.

శిలాజ ఇంధనాల వాటా (Fossil Fuels): బొగ్గు, ద్రవ వాయువుల వంటి శిలాజ ఇంధనాల కాలుష్యం వల్ల ఏకంగా 7,52,000 (మొత్తం మరణాల్లో 44 శాతం) మరణాలు సంభవించాయి. రోడ్డు రవాణా కాలుష్యం వల్ల అంటే ఇంధనం ద్వారా వెలువడిన కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలు 2.69 లక్షలు.

అడవుల మంటలు.. 2020-2024 మధ్య కాలంలో, అడవుల్లో మంటల నుంచి వచ్చే PM 2.5 కాలుష్యం కారణంగా ఏటా సగటున 10,200 మరణాలు సంభవించాయి.

 వడగాల్పుల ఉధృతి.. అధికమైన వేడి.. 

ఈ నివేదికలో వాతావరణ మార్పుల (Climate Change) ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. వడగాల్పుల తీవ్రత.. 2024లో భారత్‌లో ప్రతి వ్యక్తి సగటున 19.8 రోజులు వడగాల్పులను ఎదుర్కొన్నారు. క్లైమేట్ చేంజ్ ప్రభావం.. ఈ 19.8 రోజుల్లో, దాదాపు 6.6 రోజులు వాతావరణ మార్పుల ఫలితమేనని నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా నష్టం.. వేడికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మరణాలు 1990ల నుంచి 23 శాతం పెరిగి, ఏటా 5,46,000 కు చేరాయి. విపరీతమైన వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా శ్రమ సామర్థ్యం తగ్గి, 2024లో సుమారు $194 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం జరిగినట్లు అంచనా.

 భవిష్యత్తులో.. 

 శిలాజ ఇంధనాలపై ఆధారపడటం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యం, జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరోగ్యంపై నిఘా ఉంచే 20 సూచికలలో 12 సూచికలు మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయికి చేరుకున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.