ఏట్రియల్ కార్డియోమయోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : ఏట్రియల్ కార్డియోమయోపతిని తొలి దశలోనే గుర్తించి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రోక్, ఇతర గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య చాలా సందర్భాల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపకపోవచ్చు. అయితే, కొన్నిసార్లు పలు రకాల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.. గుండె దడ లేదా గుండె వేగంగా కొట్టుకోవడం.అలసట, నీరసం. శారీరక శ్రమ చేసినప్పుడు ఆయాసం రావడం.ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..
ముప్పును తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. క్రమం తప్పని పరీక్షలు: ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.రోజుకు కనీసం 30 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా) చేయాలి.
పొగ, మద్యం దూరం: ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
