New study : బోన్ స్ట్రెంత్ విషయంలో గట్ హెల్త్ పాత్ర కీలకం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరానికి ఆధారాన్నిచ్చే ఎముకలు దృఢంగా ఉండాలంటే కేవలం కాల్షియం, విటమిన్-డి మాత్రమే సరిపోవు. మనం తీసుకునే ఆహారం జీర్ణమయ్యే పేగు ఆరోగ్యం (Gut Health) కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సరికొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పేగులోని మంచి బ్యాక్టీరియా, పోషకాహారాల మధ్య ఉన్న సంబంధం ఎముకల సాంద్రతను (Bone Density) పగుళ్ల ప్రమాదాన్ని (Fracture Risk) అంచనా వేయడంలో కీలకంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 గట్ హెల్త్, ఎముకలకు లింక్ ఏంటి..?  

ఎముక నిరంతరం పునర్నిర్మించుకోగలిగే సజీవ కణజాలం. ఈ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే కాల్షియం, విటమిన్-డి వంటి పోషకాలు శరీరానికి పుష్కలంగా అందాలి. ఈ పోషకాలను పేగులు సమర్థవంతంగా గ్రహించుకునేలా చేసేది పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల (Gut Microbiota) సమతుల్యతే.

 పేగుల్లోని మంచి బ్యాక్టీరియా (Probiotics) కొన్ని రకాల విటమిన్-కె2 వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాల్షియంను ఎముకల్లోకి చేర్చడంలో సహాయపడతాయి. గట్ హెల్త్ దెబ్బతింటే శరీరంలో మంట (Inflammation) పెరుగుతుంది. ఈ దీర్ఘకాలిక వాపు ఎముకల క్షీణత వేగాన్ని పెంచి, ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) ప్రమాదాన్ని పెంచుతుంది.

 ఆరోగ్యకరమైన పేగు మైక్రోబయోమ్ ఉత్పత్తి చేసే 'షార్ట్-చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్' వంటి పదార్థాలు ఎముకల నిర్మాణంలో పాలుపంచుకుంటాయి.


 ఎముక సాంద్రత తగ్గడం.. 

పేగు మైక్రోబయోమ్ కూర్పులో మార్పులు వచ్చిన వారిలో ఎముక సాంద్రత తగ్గడం, పగుళ్ల ప్రమాదం పెరగడం గమనించారు. ఈ పరిశోధనల ఆధారంగా భవిష్యత్తులో కేవలం ఎముక సాంద్రత పరీక్షలే కాకుండా...పేగు మైక్రోబయోమ్‌ను విశ్లేషించడం ద్వారా కూడా ఆస్టియోపొరోసిస్, పగుళ్ల ముప్పును మరింత కచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఎముక దృఢత్వానికి ఏం చేయాలి..?

కాల్షియం (పాలు, పెరుగు, ఆకుకూరలు), విటమిన్-డి (సూర్యరశ్మి, సప్లిమెంట్లు), ప్రోటీన్, విటమిన్-కె అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి.
 
గట్ హెల్త్ కోసం.. 

పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods) వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ముఖ్యం. అలాగే, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే ఫైబర్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచాలి.
 
నడక, రన్నింగ్, బరువులు ఎత్తడం వంటి వెయిట్-బేరింగ్ వ్యాయామాలు ఎముకల సాంద్రతను పెంచడానికి తోడ్పడతాయి. ధూమపానం,మద్యపానం ఎముకలను బలహీనపరుస్తాయి, కాబట్టి వాటిని వెంటనే మానేయాలి. ఆరోగ్యకరమైన గట్ హెల్త్ , సరైన పోషణతో కూడిన జీవనశైలి ఎముకల పటిష్టతకు, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?  

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.