Allopathy and Ayurveda Course : ఒకే కోర్సులో అలోపతి, ఆయుర్వేదం..! త్వరలో అందుబాటులోకి 'డ్యూయల్ మెడికల్ డిగ్రీ'..
సాక్షి లైఫ్ : భారత వైద్య విద్యా వ్యవస్థలో త్వరలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న అలోపతి ఎంబీబీఎస్, ఆయుర్వేద బీఏఎంఎస్.. వైద్య విధానాలను కలిపేస్తూ 'ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు'ను రూపొందించారు. దీనికి ఇప్పటికే అధికారికంగా అనుమతులు కూడా లభించినట్లు సమాచారం.
కొత్త కోర్సు ప్రత్యేకతలు ఏమిటి..?
కోర్సు కాలవ్యవధి.. ఈ డ్యూయల్ డిగ్రీ కోసం విద్యార్థులు 5.5 ఏళ్లు చదవాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. రెండింట్లోనూ ప్రాక్టీస్..ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారు అలోపతి, ఆయుర్వేదం.. రెండు విధానాల్లోనూ అధికారికంగా వైద్య సేవలు అందించేందుకు అర్హత సాధిస్తారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
పీజీకి మార్గం సుగమం.. ఈ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తయ్యాక, విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి అలోపతి లేదా ఆయుర్వేద విభాగాల్లో పీజీ (postgraduate) ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. పుదుచ్చేరిలోని ప్రతిష్ఠాత్మక 'జిప్‌మర్ (JIPMER)' వేదికగా రానున్న కొద్ది నెలల్లోనే ఈ డ్యూయల్ డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ రెండు వైద్య విధానాలకు అనుగుణంగా సరికొత్త సిలబస్‌ను సిద్ధం చేసే బాధ్యతను 'ఆరోవిల్ ఫౌండేషన్' తీసుకుంది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐఎంఏ (IMA)..
ప్రభుత్వం ఈ నూతన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రెండు పూర్తి భిన్నమైన వైద్య విధానాలను ఇలా కలగలుపుతూ బోధించడాన్ని వారు 'మిక్సోపతీ (Mixopathy)'గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి డ్యూయల్ కోర్సుల వల్ల ఏ ఒక్క వైద్య విధానంలోనూ పూర్తి నైపుణ్యం లేని 'హైబ్రిడ్ డాక్టర్లు' తయారయ్యే ప్రమాదం ఉందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఏ వైద్యం తీసుకోవాలనే రోగి స్వేచ్ఛను, హక్కును ఈ విధానం కాలరాస్తుందని.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
