Cancer Diagnosis : ఇకపై క్యాన్సర్ నిర్ధారణకు ఉపయోగించే ఏఐ టూల్స్ కు ఆమోదం తప్పనిసరి : CDSCO
సాక్షి లైఫ్ : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (artificial intelligence)శరవేగంగా దూసుకొస్తోంది. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నిరంగాల్లో ఏఐ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. వైద్య రంగంలో కూడా ఏఐ టూల్స్ ను వినియోగి స్తున్నారు. అయితే కృత్రిమ మేధ (AI) పనితీరుపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిఘా పెట్టింది. ఇకపై ఎక్స్-రేలు, సీటీ స్కాన్లు, ఇతర టెస్టులను విశ్లేషించి క్యాన్సర్‌ను గుర్తించే లేదా నిర్ధారించే ఏఐ సాఫ్ట్‌వేర్‌లను 'క్లాస్-సి' వైద్య పరికరాలుగా పరిగణించనున్నారు. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది కూడా చదవండి..Respiratory Diseases : శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులకు వైద్యనిపుణుల సూచనలు..!
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Afternoon Nap: మధ్యాహ్నం నిద్ర.. వరమా..? శాపమా..?
ఎందుకీ కఠిన నిబంధనలుఅంటే..?
ప్రస్తుతం చాలా ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు,(hospitals and diagnostic centers) క్యాన్సర్ స్క్రీనింగ్ (cancer screening) కోసం AI అల్గారిథమ్స్(AI algorithms)ను వాడుతున్నాయి. అయితే, ఇవి ఇచ్చే ఫలితాలు రోగి ప్రాణాలతో ముడిపడి ఉన్నందున, ఏమాత్రం లోపాలు ఉన్నా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే వీటిని నియంత్రణ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కీలక మార్పులివే..
అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి.. ఇకపై క్యాన్సర్ నిర్ధారణకు ఉపయోగించే ఏఐ టూల్స్ వినియోగంలోకి రావాలంటే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అధికారిక ఆమోదం పొందాలి.
ప్రామాణికత పరీక్ష (Standardization testing).. డెవలపర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ల భద్రతను, ఖచ్చితత్వాన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంటుంది. క్లినికల్ వినియోగంలో ఉన్నప్పుడు కూడా వీటి పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో అనేక స్టార్టప్‌లు ఏఐ ఆధారిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందిస్తున్నాయి. ఇకపై వీరంతా కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
ప్రయోజనం ఏంటి అంటే..?
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఏఐ ఎంతో సహకరిస్తుంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించడంలో దీని పాత్ర కీలకం. అయితే, మన దేశానికి సంబంధించిన డేటా సెట్లు తక్కువగా ఉండటంతో ఇవి ఇచ్చే ఫలితాల్లో ఖచ్చితత్వంపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజా నిబంధనలతో ఈ సాంకేతికత మరింత పారదర్శకంగా, నమ్మదగ్గదిగా మారుతుందని ఎయిమ్స్ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
ఇది కూడా చదవండి..Eye Health : డిజిటల్ యుగంలో కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
