Respiratory Diseases : శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులకు వైద్యనిపుణుల సూచనలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు సామాన్యులను గజగజ వణికిస్తున్నాయి. ఉదయం వేళ పొగమంచు, రాత్రిపూట చల్లని గాలుల ప్రభావంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఊపిరితిత్తులపై చలి ప్రభావం.. 

చలికాలంలో గాలిలోని తేమ తగ్గిపోవడం వల్ల వాతావరణం పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలను సంకోచింపజేస్తుంది. ఫలితంగా ఆస్తమా, సీఓపీడీ (COPD) వంటి సమస్యలు ఉన్నవారికి శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది. గాలి కాలుష్యం, పొగమంచు కలిసినప్పుడు ఏర్పడే 'స్మాగ్' ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణమవుతోంది.

 ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 
 
 బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలి. చెవుల ద్వారా చల్లని గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దాహం వేయకపోయినా అప్పుడప్పుడు గోరువెచ్చని నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. వేడివేడి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం ఎండ వచ్చిన తర్వాతే నడక లేదా వ్యాయామం ప్రారంభించడం ఉత్తమం.

 చల్లని గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా మాస్క్ రక్షణగా ఉంటుంది. చలికాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేయకూడదు. మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది టీబీ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.