Ayurveda Gets a Modern Makeover : ఆయుర్వేదానికి సరికొత్త హంగులు: నేటితరం చేరువగా ప్రముఖ బ్రాండ్లు..!

షేర్ చేయండి:
Ayurveda Gets a Modern Makeover : ఆయుర్వేదానికి సరికొత్త హంగులు: నేటితరం చేరువగా ప్రముఖ బ్రాండ్లు..!

సాక్షి లైఫ్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. అనేది నెమ్మదిగా ఆరోగ్యమే ఆయుర్వేదంగా.. మారిపోతోంది. అవును దిగ్గజ ఫార్మా కంపెనీలు ఇప్పుడు ఇదే బాట పడుతున్నాయి. శతాబ్ద కాలంగా భారతీయ ఇళ్లలో అంతర్భాగమైన డాబర్, హమ్దర్ద్ వంటి సంప్రదాయ సంస్థలు ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. కొన్ని మందులు కేవలం 'వృద్ధులకు మాత్రమే' అనే ముద్రను చెరిపేసి, నేటి ఆధునిక జీవనశైలికి తగినట్లుగా తమను తాము మలచుకుంటున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఆయుర్వేద ఔషధాలను సరికొత్త రీతిలో అందిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

 యువతే లక్ష్యంగా.. 

ఒకప్పుడు ఆయుర్వేదం అంటే చేదు కషాయాలు, పెద్ద పెద్ద మాత్రలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. పలు డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ ఇచ్చే ట్రెండ్‌ను అందుకునేందుకు ఈ కంపెనీలు తమ ప్యాకేజింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

షుగర్-ఫ్రీ వెర్షన్లు.. డయాబెటిస్ బాధితులు, ఫిట్‌నెస్ లవర్స్ కోసం డాబర్ తన చ్యవన్‌ప్రాష్‌లో 'షుగర్-ఫ్రీ' రకాలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు సులభమైన రూపాల్లో.. పొడులు, కషాయాలకు బదులుగా క్యాప్సూల్స్, ట్యాబ్లెట్లు, గమ్మీలు (Gummies) రూపంలో మందులను అందిస్తున్నాయి. హమ్దర్ద్ నయా స్టైల్.. చర్మ సంరక్షణ కోసం హమ్దర్ద్ తన ఐకానిక్ 'సాఫీ'ని కొత్త ప్యాకింగ్‌తో, ఆధునిక ప్రచారాలతో యువతకు చేరువ అవుతోంది.

సాంకేతికతతో తోడు.. సైన్స్‌తో సాక్ష్యం.. 

కేవలం నమ్మకం మీదే కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో (Science-backed) ఉత్పత్తులను తీసుకురావడంపై ఈ సంస్థలు దృష్టి సారించాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో 'ఆయుర్వేద సంవాద్' వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆధునిక వైద్యులు, నిపుణులతో కలిసి ఆయుర్వేద విశిష్టతను శాస్త్రీయంగా వివరిస్తున్నాయి.

డిజిటల్ విప్లవం.. ఈ-కామర్స్ హవా.. 

కొత్త ఏజ్ వెల్నెస్ స్టార్టప్‌ల (D2C brands) నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో, ఈ పురాతన బ్రాండ్లు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వేదికల ద్వారా నేరుగా వినియోగదారుల వద్దకు చేరుతున్నాయి. తరాలు మారినా, నమ్మకం మాత్రం అదే. కానీ ఆ నమ్మకాన్ని నేటి అవసరాలకు తగినట్టుగా మార్చుకోవడమే ఈ 'వెల్నెస్' ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యం. సంప్రదాయం, ఆధునికత, సంపూర్ణ ఆరోగ్యం అనే నినాదంతో ఈ దిగ్గజ కంపెనీలు జనంలోకి వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.